వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్నాప్‌డీల్ ఉద్యోగిని కిడ్నాప్: షారుక్ సినిమానే ప్రేరణ!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: స్నాప్‌డీల్ ఉద్యోగిని దీప్తీ సర్నా(24) కిడ్నాప్ కేసులో దర్యాప్తు జరిపిన పోలీసులు.. సోమవారం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అందులో ఒకరు దీప్తీని ప్రేమిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అతడు మరో నలుగురితో కలిసి దీప్తీని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే అతనిది వన్‌సైడ్ లవ్ అని చెప్పారు.

వైశాలి మెట్రో స్టేషన్ నుంచి షేరింగ్ ఆటోలో నలుగురు దుండగులు గత బుధవారం సర్నాను కిడ్నాప్ చేశారు. ఎలాంటి అపాయం లేకుండా శుక్రవారం ఆమె తన ఇంటికి చేరుకుంది. కాగా, దేవేందర్ అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు.

సర్నా ఆకర్షణలో పడిన దేవేందర్ ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు. కాగా, అతడిపై క్రిమినల్ రికార్డు కూడా ఉంది. అయితే, దేవేందర్ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ నటించిన సైకోపత్ సినిమా ‘డర్'ను ప్రేరణగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే దీప్తీని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేశాడు.

Lovestruck 'stalker' plotted Snapdeal employee's abduction, 5 arrested

దీప్తిని ప్రేమిస్తున్నందువల్లే.. దాదాపు 30గంటలపాటు దీప్తీని తన దగ్గర బందీగా ఉంచుకున్నప్పటికీ దేవేందర్ ఆమెకు ఎలాంటి హాని తలపెట్టలేదని తెలుస్తోంది.

కాగా, దీప్తీ కూడా తనను కిడ్నాప్ చేసిన వారిపై ఫిర్యాదు చేసేందుకు సుముఖత చూపలేదు. తనను కిడ్నాపర్లు తనకు ఆహారం పెట్టారని, జాగ్రత్తగా చూసుకున్నారని దీప్తి తెలిపింది. తనను వదిలిపెట్టేందుకు ఏమి డిమాండ్ చేయలేదని తెలిపింది.

English summary
Police on Monday arrested five people in connection with the abduction of Snapdeal employee Dipti Sarna and investigation lead to believe the involvement of a 'stalker' who was obsessed with her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X