వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఔషధ ధరల నియంత్రణతో సామాన్యుడి ఆరోగ్యానికి భరోసా ఇచ్చిన మోడీ ప్రభుత్వం

|
Google Oneindia TeluguNews

సామాన్య ప్రజలకు మంచి ఆరోగ్యం అందించాలన్న లక్ష్యంతో మోడీ ప్రభుత్వం కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. నాణ్యమైన వైద్యం అందరికీ అందుబాటులోకి రావాలని మోడీ భావించారు. ఔషధ ధరల నియంత్రణ ఎన్‌పీపీఏ 92 ఔషధాలపై ఒకే ధర నిర్ణయించింది. ఇందులో క్యాన్సర్, హెపటైటిస్ సీ, మైగ్రేన్, మధుమేహంలాంటి వ్యాధుల ఔషధాల ధరలు కూడా నియంత్రణలోకి తీసుకొచ్చారు.

72 ఔషధాల ధరలను ఫిక్స్ చేయడంతో పాటు మరో 9 మందులను రివైజ్ చేయడం జరిగింది. అంతేకాదు మరో 11 మందుల ధరలను కూడా నేషనల్ ఫార్మాష్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ రివైజ్ చేయడం జరిగింది. 2013లో ఎన్‌పీపీఏ ఇచ్చిన ఆదేశాల మేరకు ఔషధాల ధరలపై నియంత్రణ తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఇక ఈ పరిధిలోనికి రాని ఔషధాల ధరలు ఏడాదికి 10శాతం మేరా రిటైల్ ధరలను పెంచుకోవచ్చని ఎన్‌పీపీఏ సూచించింది.

Low cost medicines & devices bring new lease of life

5 మార్చి 2018 ప్రకారం ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన పథకం కింద 33 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 3214 ఔషధ కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది. జనరిక్ మందులను సరసమైన ధరలకే ఈ కేంద్రాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన పథకం కింద 700 ఔషధాలు, 154 సర్జికల్ పరికరాలు కేంద్ర ప్రభుత్వం సరసమైన ధరలకే అందిస్తోంది.

గుండె చికిత్సలో భాగంగా అమర్చే సాధారణ స్టంట్‌ ధర కూడా రూ.7260గా చేసింది. డ్రగ్ ఎలూటింగ్ స్టంట్ ధరను కూడా 29,600గా ఫిక్స్ చేసింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ నుం 13 ఫిబ్రవరి 2017న జారీ చేసింది. ఆ తర్వాత WPI లెక్కలను ఆధారం చేసుకుని మళ్లీ ఈ ధరలను పునరుద్ధరించింది. దీంతో సాధారణ స్టంట్ ధర రూ.7400 చేయగా... డ్రగ్ ఎలూటింగ్ స్టంట్ ధరను రూ.30,180 చేసింది. 1 ఏప్రిల్ 2017 నుంచి కొత్త ధరలను అమల్లోకి తీసుకొచ్చింది. 2017-18 వార్షిక నివేదిక ప్రకారం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయకముందు సామాన్య స్టంట్ ధర రూ.45100 ఉండగా... అదే డీఈఎస్ ధర రూ. 1,21,400గా ఉన్నింది. ధరలను పునరుద్ధరించాక సాధారణ స్టంట్ దాదాపు 85శాతానికి పడిపోగా డ్రగ్ ఎలూటింగ్ స్టంట్ ధరలు 74శాతం మేరా తగ్గాయి. ఇక ప్రజలపై ఏడాదికి దాదాపు రూ.4వేల450 కోట్లు భారం తగ్గింది.

భారత్‌లో ప్రతి ఏటా లక్ష నుంచి లక్ష50వేల మోకాళ్ల సర్జరీలు జరుగుతున్నాయి. ధరలపై నియంత్రణ విధించడంతో ప్రజలపై ఏడాదికి రూ.1500కోట్ల భారం తగ్గుతోంది. చివరి మనిషి వరకు వైద్యం అందాలన్న మంచి ఉద్దేశంతోనే ధరల నియంత్రణ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.

English summary
The Narendra Modi government has taken bold steps to offer affordable healthcare to common people of the country. The Modi government has walked the talk of 'Affordable, Quality Healthcare for All'.Drug price regulator NPPA has fixed the ceiling price for 92 drug formulations, including those used for treatment of cancer, hepatitis C, migraine and diabetes among others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X