వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు వరస తుఫాన్ల తాకిడి..బంగాళాఖాతంలో మరో సైక్లోన్ ,పేరు ఏంటో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

భారత్‌ను వరస తుఫానులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే అంఫన్, నిసర్గ తుఫాన్లు పశ్చిమబెంగాల్, ఒడిషా, మహారాష్ట్ర గుజరాత్‌లను అతలాకుతలం చేశాయి. ఇది మరువక ముందే భారత్‌కు మరో ప్రమాదం పొంచి ఉందనే సంకేతాలు ఇస్తోంది భారత వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో కొద్ది రోజుల క్రితం ఏర్పడ్డ అంఫన్ తుఫాను తర్వాత మరో అల్పపీడనం అక్కడ డెవలప్‌ అవుతోందంటూ భారత వాతావరణశాఖ చెబుతోంది.

Recommended Video

Cyclone Gati: Another Low Depression in Bay Of Bengal

 Cyclone Nisarga: అలా ముంబైకి తప్పిన ముప్పు, బలహీనపడిన తుఫాను, ముగ్గురు మృతి Cyclone Nisarga: అలా ముంబైకి తప్పిన ముప్పు, బలహీనపడిన తుఫాను, ముగ్గురు మృతి

 భారత్‌లో వరస తుఫాన్లు

భారత్‌లో వరస తుఫాన్లు

భారత్‌ను వరస తుఫానులు గడగడలాడిస్తున్నాయి. ఇప్పటికే అంఫన్ తుఫాను నిసర్గ తుఫాను చేయాల్సిన నష్టం చేయగా తాజాగా మరో తుఫాను పంజా విసిరేందుకు సిద్ధంగా ఉంది. బంగాళాఖాతంలో మే 13న అల్పపీడనం ఏర్పడి అది క్రమంగా తుఫానులా మారింది. అంఫన్ తుఫాను ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను అతలాకుతలం చేసిన ఘటన మరువక ముందే అదే బంగాళాఖాతంలో మరో తుఫాను విరుచుకుపడేందుకు సిద్ధమవుతోంది.

 బంగాళా ఖాతంలో మరో అల్పపీడనం

బంగాళా ఖాతంలో మరో అల్పపీడనం

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం జూన్ 10వ తేదీకల్లా బలపడి తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక దీని ప్రభావంతో ఉరుములతో కూడిన వర్షాలు, భారీగా గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. జూన్ 11వ తేదీ సాయంత్రం నుంచి జూన్ 13వ తేదీ వరకు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు. దీని ప్రభావంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్‌లలో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

 తుఫానే వస్తే దాని పేరు ఏంటంటే..?

తుఫానే వస్తే దాని పేరు ఏంటంటే..?

ఇక మబ్బులు కమ్ముకుని ఉండటం వర్షాలు పడుతాయి కాబట్టి ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో జూన్ 15వరకు వడగాలుల తీవ్రత ఉండదని చెప్పారు. వచ్చేవారం మయాన్మార్ తీరంలో అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పిన వాతావరణశాఖ దేశంలో మంచి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. అయితే ఒక తుఫాను ఏర్పడటానికి ముందు అల్పపీడనం ఏర్పడుతుందని అలా అని అన్ని అల్పపీడనాలు తుఫానుకు దారితీయవనే విషయాన్ని గమనించాలని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక భారత వాతావరణశాఖకు ఎనిమిది అంచెల తుఫాను వ్యవస్థ కలిగి ఉంది. నాలుగో దశకు ఈ అల్పపీడనం చేరుకుంటే దాన్ని తుఫానుగా పరిగణిస్తామని ఒకవేళ అదే జరిగితే ఈ తుఫానుకు "గతి " అనిపేరు పెడుతామని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.

English summary
Another low depression is developing in Bay Of Bengal which might turn into another cyclone storm said IMD.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X