హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ రేట్లు...

|
Google Oneindia TeluguNews

గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. ఎల్పీజీ ధర గత నాలుగు నెలలుగా వరసగా పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. నెలవారీ ధరల సవరింపులో భాగంగా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 14.2 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరను మరోసారీ పెంచింది.

అదే నాన్ సబ్సీడీ 14.2కేజీల ఎల్పీజీల సిలిండర్ ధర ఏకంగా రూ.25 పెరిగింది. ఇక సబ్సీడీ సిలిండర్ల ధరను కూడా 1 రూపాయి 23 పైసలు పెరిగింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి కనపడింది. కాగా పెరిగిన ధరలు జూన్ 1 నుంచి అమలుకానున్నాయి.

LPG cylinder price once again hike

నాన్ సబ్సీడీ సిలిండర్ ధరలు ప్రాంతాల వారీగా..హైదరాబాద్‌లో గ్యాస్ ధరల పెంపుకు
ముందు రూ. 768.00 ఉండగా అనంతరం రూ. 793.00గా ఉన్నాయి.ఇక ఢిల్లీలో గ్యాస్ ధరలు పెంపునకు ముందు రూ.712.5గా ఉండే ధరలు.. పెరిగిన తర్వాత రూ.737.5 గా ఉన్నాయి. కోల్‌కతాలో రూ.763.5 గా ఉండే గ్యాస్ ధర.. రూ.738.5 గా మారింది. ముంబైలో రూ.684.5 గా ఉండే ధర రూ.709.5 గా ఉంది. చెన్నైలో రూ.728 గా ఉండే ధర రూ.753 గా మారింది

సబ్సీడీ సిలిండర్ ధరలు ప్రాంతాల వారీగా..ఢిల్లీలో గ్యాస్ ధరలు పెంపునకు ముందు రూ.496.14గా ఉండే ధరలు.. పెరిగిన తర్వాత రూ.497.37 గా ఉన్నాయి. కోల్‌కతాలో రూ.499.29 గా ఉండే గ్యాస్ ధర.. రూ.500.52 గా మారింది. ముంబైలో రూ.493.86 గా ఉంది. హైదరాబాద్‌లో 505 రూపాయలుగా ఉంది.

English summary
prices of crude. When these go higher, LPG cylinder rates in Hyderabad also tend to move higher. For the poorer sections, the government has subsidized these prices
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X