వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

LPG Gas Cylinder Price: తొలిరోజే షాక్ -గ్యాస్ సిలిండర్ ధర రూ.73.50 పెంపు -వారికి మాత్రం ఊరట

|
Google Oneindia TeluguNews

ఇప్పటికే అధిక ధరలతో సతమతం అవుతోన్న జనానికి ఆగస్టు నెల తొలిరోజే ఆయిల్ కంపెనీలు షాకిచ్చాయి. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల ధరలు ఆదివారం పెరిగాయి. కమర్షియల్(వాణిజ్య) గ్యాస్ సిలిండర్ల ధరను మరో రూ.73.50 పెంచాయి చమురు కంపెనీలు. అయితే..

కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను అదనంగా రూ.73.50 పెంచిన ఆయిల్ కంపెనీలు సామాన్యులకు మాత్రం కాస్త ఊరట కలిగించాయి. గృహావసరాలకు వాడే(డొమెస్టిక్) ఎల్పీజీ ధరలు మాత్రం పెంచకుండా, పాతరేట్లే కొనసాగనున్నాయి.

LPG Gas Cylinder Price: Cooking gas cylinder price hiked by Rs73.50 for commercial

ఆదివారం నాటి (రూ.73.50) పెంపుతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.1500 నుంచి రూ.1623 కి పెరిగింది. గత జూలై నెలలో చమురు కంపెనీలు సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.25.50, కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.84వరకు పెంచాయి. కమర్షియల్‌ సిలిండర్లను ఎక్కువగా హోటళ్లు, ఇతర వ్యాపార అవసరాలకు కోసం వినియోగిస్తుండటం తెలిసిందే.

కేవలం రెండు నెలల్లో రూ.157.50 వరకు ధర పెరగడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర రూ.1803గా ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీలో 14.2కిలోల సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.834.50కి చేరగా.. కోల్‌కతాలో రూ.861, ముంబైలో రూ.864.50, చెన్నైలో రూ.850.50, హైదరాబాద్‌లో రూ.887 ధర పలుకుతోంది.

English summary
On the first day of the month itself, there has been a blow on the pocket of the common man. The prices of commercial gas cylinders (LPG Gas Cylinder Price) have increased again. Government oil companies have increased the prices of commercial gas cylinders by Rs 73.5 per cylinder. In the capital Delhi, the price of 19 kg commercial gas cylinder has increased from Rs 1,500 to Rs 1623 per cylinder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X