వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

6నెలల్లో తొలిసారి: భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వంట గ్యాస్ వినియోగదారులకు ఇది దీపి కబురే. మార్చి 1 నుంచి నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. గత ఆగస్టు నుంచి పెరుగుతూ వచ్చిన వరుసగా ఆరు నెలలుగా పెరుగుతూ వచ్చిన సిలిండర్ ధరలు ఈ మార్చి నెలలో తగ్గాయి.

మార్చి 1 నుంచి తగ్గిన ధరలు..

మార్చి 1 నుంచి తగ్గిన ధరలు..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 1 (ఆదివారం) నుంచి నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధరలు ఢిల్లీ, ముంబైలో 14.2కిలోల సిలిండర్‌పై రూ. 53 తగ్గింది. గత ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు సుమారు 50 శాతం వరకు ఆరు దశలుగా పెరుగుతూ వచ్చిన సిలిండర్ ధరలు తొలిసారిగా భారీగా తగ్గడం గమనార్హం.

మెట్రో నగరాల్లో ధరలు ఇలా..

మెట్రో నగరాల్లో ధరలు ఇలా..

14.2 కిలోల ఎల్పీజీ నాన్ సబ్సిడీ సిలిండర్ ధర ముంబైలో ఇంతకు ముందు రూ. 858.50 ఉండగా, ఇప్పుడు 805.5గా ఉంది. కోల్‌కతాలో ఇంతకుముందు రూ. 896.00 ఉండగా, ఇప్పుడు 839.5గా ఉంది. ముంబైలో ఎల్పీజీ సిలిండర్ ధర ఇంతకు ముందు రూ. 829.50గా ఉండగా.. 776.5గా ఉంది. చెన్నైలో నాన్ సబ్సిడీ ఎల్పీ సిలిండర్ ధర రూ. 881.00 ఉండగా.. ఇప్పుడు రూ. 826కు తగ్గింది.

సబ్సిడీ సిలిండర్ల కంటే ఎక్కువ వాడితే..

సబ్సిడీ సిలిండర్ల కంటే ఎక్కువ వాడితే..

19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలు ఢిల్లీలో ఇంతకు ముందు 1,466.00గా ఉండగా.. ఇప్పుడు రూ. 1,381.00గా ఉంది. ముంబైలో రూ. 1540.50 ఉండగా.. రూ. 1331.50 తగ్గింది.

ప్రతి నెలా వంట గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఒక్కో వినియోగదారుడు ఏడాదికి గరిష్టంగా 12 సిలిండర్ల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంది. అంతకు మించి వాడితే సబ్సిడీ లేకుండానే సిలిండర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

English summary
In its monthly revision, prices of non-subsidized 14.2 kg LPG (liquid petroleum gas) cylinders were cut by an average of Rs 54 on Sunday by the state-owned Indian Oil Corporation Limited (IOC) after six consecutive months of increase in rates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X