వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు: సబ్సిడీపై రూ.2.89

|
Google Oneindia TeluguNews

ముంబై: ఓ వైపు పెట్రోపెరుగుతున్న పెట్రోల్ ధరలు ఆందోళన కలిగిస్తుంటే..
మరోవైపు దేశీయంగా వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ .59 పెరిగింది. 14.2 కిలోల బరువున్న సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.2.89, సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్‌పై రూ.59 పెంచుతున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) తెలిపింది.

Recommended Video

పెరిగిన పెట్రోల్ ధర..లీటరు రూ.90

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించిన నేపథ్యంలో సబ్సిడీలేని సిలిండర్‌పై రూ.59 పెంచామని వెల్లడించింది.

LPG price hiked; Subsidised gas increased by Rs 2.89 per cylinder, non-subsidised by Rs 59

ఇక పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబర్‌ 1 సోమవారం పెట్రోలు ధర 24పైసలు డీజిల్‌ 30పైసలు పెరిగింది. న్యూఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 83.73 రూపాయలు. డీజిల్‌ ధర లీటరు 75.09 రూపాయలు. ఇక వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డ్‌ స్థాయిని తాకి మరింత సెగ రాజేస్తున్నాయి.

లీటరు పెట్రోలు ధర 91 రూపాయల మార్క్‌నుదాటి 91.08 రూపాయల వద్ద వుంది. అలాగే 32పైసలు పెరిగిన డీజిల్‌ లీటరు ధర రూ .79.72 గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ లీటరు ధర రూ. 88.77గాను, డీజిల్‌ ధర 81.68 గా ఉంది. విజయవాడలో లీటరు పెట్రోలు ధర రూ.87.78, డీజిల్‌ ధర రూ. 80.37.

English summary
Subsidised cooking gas (LPG) price was on Sunday hiked by Rs 2.89 per cylinder to Rs 502.4 per cylinder. The price of non-subsidised LPG at Delhi will increase by Rs 59.00 per cylinder in October 2018 mainly due to change in international price and foreign exchange fluctuations, Indian Oil Corporation (IOC) said in a statement.
Read in English: LPG price hiked
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X