వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ సీట్లు కష్టం, నాడు మోడీ హవా, నేడు సునామి, రామ్ మాధవ్ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల తరువాత మెజారిటీ సీట్లు రాకుంటే మిత్రపక్షాలతో కలిసి బీజేపీ అధికారంలోకి రావడం అనివార్యం అయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ సీట్లు రావడం డౌట్ గా ఉందని రామ మాధవ్ చెప్పారు.

ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపి 271 నియోజక వర్గాల్లో విజయం సాదిస్తే చాల సంతోషిస్తామని అన్నారు. అలా జరగకుంటే ఎన్ డీఏ మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని రామ్ మాధవ్ చెప్పారు.

ls polls BJP may need-other parties for majority says Ram Madhav

2014 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర భారతదేశంలో క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ 2019 లోక్ సభ ఎన్నికల్లో అనేక నియోజక వర్గాల్లో ఓటమి చెందుతుందని పలు సర్వేలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం హవా ఉన్నందున బీజేపీ ఎన్ డీఏ మిత్రపక్షాలతో అధికారంలోకి వస్తుందని రామ్ మాధవ్ ఆ ఇంటర్వూలో చెప్పారు.

2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ హవా పని చేసిందని, 2019 లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ సునామి పని చేసిందని, బీజేపీకి ఒక్క ఓటు వేస్తే ఉగ్రవాదుల మీద వెయ్యి కేజీల బాంబు వేసినట్లు అయ్యిందని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య చెప్పిన మాటలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ గుర్తు చేశారు. మొత్తం మీద బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సంచలన వ్యాఖ్యల మీద చర్చ మొదలైయ్యింది.

English summary
BJP may need other parties for majority after Lok Sabha elections 2019 results, BJP national general secretary Ram Madhav said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X