వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నామినేషన్: అజహర్‌తో సంగీతా, దిమ్మదిరిగే రాజా ఆస్తి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆరు ఏడో విడతకు సంబంధించి పలు రాష్ట్రాల్లో అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్, యూపి సిఎం అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్‌లు నామినేషన్లు దాఖలు చేశారు.

సల్మాన్ ఖుర్షీద్ యూపిలోని ఫరూఖాబాద్ స్థానానికి, అజహరుద్దీన్ రాజస్థాన్‌లోని టోంక్ సవాయ్ మాధోపూర్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. డింపుల్ యాదవ్ కనౌజ్ నుండి బరిలో నిలుస్తున్నారు.

పిఎంకె అధినేత జెకె మణి కృష్ణగిరి లోకసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. బిజెపి నేత హేమమాలిని యూపిలోని మధుర నుండి నామినేషన్ దాఖలు చేశారు.

 హేమమాలిని

హేమమాలిని

ప్రముఖ నటి హేమమాలిని ఉత్తర ప్రదేశ్‌లోని మధుర నుండి రానున్న లోకసభ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఆమె గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తన ఆస్తులను రూ.192 కోట్లుగా చూపారు.

అజహరుద్దీన్

అజహరుద్దీన్

రాజస్థాన్‌లోని టోంక్ సవాయ్ మాధోపూర్ నుండి బరిలో నిలుస్తున్న అజహరుద్దీన్ తన ఆస్తులను రూ.5.45 కోట్లుగా చూపారు. అజర్ నామినేషన్ సమయంలో సంగీతా బిజ్లాని పక్కనే ఉన్నారు.

సల్మాన్ ఖుర్షీద్

సల్మాన్ ఖుర్షీద్

కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్ యూపిలోని ఫరూఖాబాద్ స్థానం నుండి లోకసభకు పోటీ చేస్తున్నారు. ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తన ఆస్తులను ఖుర్షీద్ రూ.5.44 కోట్లుగా పేర్కొన్నారు.

డింపుల్ యాదవ్

డింపుల్ యాదవ్

ఉత్తర ప్రదేశ్‌లోని కనౌజ్ స్థానానికి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు.

 రాజా

రాజా

మాజీ కేంద్రమంత్రి రాజా ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులను కేవలం రూ.3.6 కోట్లుగా చూపారు. రూ.1.76 లక్షల కోట్ల 2 జి కుంభకోణనంలో నిందితుడిగా ఉన్న రాజా అఫిడవిట్లో అంతే మొత్తం చూపడం గమనార్హం. 2జి కేసుతో రాజా అప్పుడు కళ్లు తిరిగేలా చేస్తే... ఇప్పుడు కేవలం మూడున్నర కోట్ల రూపాయలు చూపి కళ్లు తిరిగేట్టు చేస్తున్నారంటున్నారు.

English summary
Union minister Salman Khurshid, former cricketer Mohammad Azharuddin, UP Chief Minister's wife Dimple Yadav and PMK president G K Mani were among the notable candidates who entered the fray on Thursday as filing of nominations for 6th and 7th phases of Lok Sabha polls gathered steam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X