
Lucky chance: రెండు నిమిషాల్లో రెండు రాష్ట్రాల అమ్మాయిలతో పెళ్లి, పొటుగాడి స్కెచ్ !
జార్ఖండ్/ పశ్చిమ బెంగాల్: ఈ కాలంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని కాపురం చెయ్యడమే కష్టంగా మారిపోయిందని చాలా మంది భర్తలు అంటున్నారు. పెళ్లి చేసుకున్న దంపతులు జీవితాంతం సుఖంగా ఉండాలని అందరూ ఆశీర్వదిస్తారు. నా భర్త నాకే సొంతం అని భార్య, నా భార్య జీవితాంతం నాతోనే ఉండాలని భర్త ఆశపడుతుంటారు. ఇక్కడ ఓ పొటుగాడు ఒకే వేదిక మీద ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. రెండు నిమిషాల్లో రెండు రాష్ట్రాలకు చెందిన వేర్వేరు కులాలకు చెందిన యువతులను పెళ్లి చేసుకున్నాడు. ఓ అమ్మాయితో సహజీవనం చేసి ఓ బిడ్డకు తల్లిని చేసి తరువాత ఆమె మెడలో తాళికట్టాడు. మరో అమ్మాయిని ప్రేమించి అదే వేదిక మీద ఆ అమ్మాయి మెడలో కూడా తాళికట్టాడు. ఊరందరి సమక్షంలో ఇద్దరిని ఒకేసారి పెళ్లి చేసుకున్న ఆ పొటుగాడు హాట్ టాపిక్ అయ్యాడు.
High Court: ప్రియురాలు, ఆమె పిల్లల హత్య కేసులో ట్విస్ట్, హైకోర్టు సంచలన తీర్పు, ప్రియుడు నిర్దోషి!

యువతితో సహజీవనం
జార్ఖండ్ లోని లోహదుర్గా సమీపంలోని భాంద్రా బ్లాక్ లోని బండా గ్రామంలో సందీప్ ఓరాన్ అనే యువకుడు, కుసుమా లాక్రా అనే యువతి నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుుంటున్న సందీప్, కుసుమా పెళ్లికాకుండా ఓ ఇంటిలో కాపురం ఉంటూ సహజీవనం చేస్తున్నారు. సందీప్, కుసుమా సహజీవనం చేస్తున్న విషయం గ్రామస్తులు, వాళ్ల బంధువులు అందరికి తెలుసు.

పశ్చిమ బెంగాల్ కు పనికి వెళ్లాడు
సందీప్ తో సహజీవనం చేస్తున్న కుసుమా పెళ్లికాకుండా ఓ పాపకు తల్లి అయ్యింది. భార్య, పాపను పోషించడానికి ఏదైనా పని చెయ్యాలని సందీప్ అనుకున్నాడు. తరువాత కుసుమా, పాపను సొంత గ్రామంలో వదిలిపెట్టిన సందీప్ పశ్చిమ బెంగాల్ లో ఇటుకల ఫ్యాక్టరీలో పని చెయ్యడానికి వెళ్లాడు. సంవత్సరం నుంచి ఇటుకల ఫ్యాక్టరీలో పని చేస్తున్న సందీప్ అప్పుడప్పుడు ఊరికి వెళ్లి ప్రియురాలు కుసుమాతో కాలం గడుపుతున్నాడు.

పని చేసే చోట ప్రియురాలు
ఇటుకల ఫ్యాక్టరీలో పని చేస్తున్న సందీప్ ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న స్వాతి కుమారి అలియాస్ స్వాతి అనే యువతిని ప్రేమించాడు. కొన్ని నెలల నుంచి సందీప్ అతని ప్రియురాలు స్వాతితో శారీరక సంబంధం పెట్టుకుని ఆమెతో ఎంజాయ్ చేశాడు. కొన్ని నెలల నుంచి స్వాతి మోజులో పడిన సందీప్ అతని మొదటి ప్రియురాలు కుసుమాను పట్టించుకోవడం మానేశాడు.

పంచాయితీ పెట్టిన గ్రామస్తులు
సందీప్ మ్యాటర్ గ్రామస్తులకు తెలిసిపోవడంతో పంచాయితీ పెట్టారు. పంచాయితీకి సందీష్ ఇద్దరు లవర్స్ స్వాతి, కుసుమా వెళ్లారు. నాకు ఇద్దరు కావాలని, ఇద్దరిని పెళ్లి చేసుకుంటానని సందీప్ పంచాయితీ పెద్దలకు చెప్పాడు. సందీప్ మా ఇద్దరిని పెళ్లి చేసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేది స్వాతి, కుసుమా పంచాయితీలో చెప్పారు. అమ్మాయిలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సందీప్ ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు.


రెండు నిమిషాల్లో రెండు రాష్ట్రాల యువతులతో పెళ్లి
సందీప్ పంచాయితీ జరుగుతున్న ఊరి మధ్యలోని ఒకే వేదిక మీద ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. రెండు నిమిషాల్లో రెండు రాష్ట్రాలకు చెందిన వేర్వేరు కులాలకు చెందిన యువతులను సందీప్ పెళ్లి చేసుకున్నాడు. సహజీవనం చేసి ఓ బిడ్డకు తల్లిని చేసి తరువాత కుసుమా మెడలో తాళికట్టాడు. ప్రేమించిన స్వాతికి అదే వేదిక మీద ఆమె మెడలో సందీప్ కూడా తాళికట్టాడు. ఊరందరి సమక్షంలో ఇద్దరిని ఒకేసారి పెళ్లి చేసుకున్న పొటుగాడు సందీప్ ఇప్పుడు జార్ఖండ్ లో హాట్ టాపిక్ అయ్యాడు.