జూన్ 5-జూన్ 6వ తేదీల్లో నింగిలో మరో అద్భుతం: మూడు గంటల పాటు చంద్రగ్రహణం
ఈ ఏడాది జనవరిలో తొలి చంద్రగ్రహణం వీక్షించాం. మరోసారి భారతీయులకు కనువిందు చేసేందుకు మళ్లీ చంద్రగ్రహణం రానుంది. జూన్ 5వ తేదీ మరియు జూన్ 6వ తేదీల్లో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. తొలిసారి ఏర్పడిన చంద్ర గ్రహణంలా ఈ సారి గ్రహణం కూడా గుర్తించడం కాస్త కష్టతరంగానే ఉంటుంది. ఇక ఈ చంద్రగ్రహణంను స్ట్రాబెర్రీ మూన్ ఎక్లిప్స్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళశాస్త్రవేత్తలు పిలుస్తున్నారు.

ఏ దేశాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుంది..?
జూన్ 5 - జూన్ 6వ తేదీల మధ్య కనువిందు చేయనున్న చంద్రగ్రహణంను ఎప్పుడు ఎలా చూడాలనేదానిపై చాలామందికి ఐడియా లేదు. ఈ సారి చంద్రగ్రహణం ఆసియా, యూరోప్, ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తుంది. ఈ సమయంలో చంద్రుడికి సూర్యుడికి మధ్యన భూమి అడ్డుగా వస్తుంది. అంటే సూర్యుడి నుంచి వెలుతురు చంద్రుడిపైకి పడకుండా భూమి అడ్డుకుంటుంది. ఆ సమయంలో భూమిపై ఉన్న వారికి చంద్రుడు కనిపించడు. ఇది ఎప్పుడూ పౌర్ణమి రోజే జరుగుతుంది. ఇక చంద్రగ్రహణంను నేరుగా వీక్షించొచ్చు. టెలిస్కోప్ కూడా అక్కర్లేదు.

చంద్రగ్రహణం సమయం
భారత కాలమాన ప్రకారం చంద్రగ్రహణం జూన్ 5వ తేదీ రాత్రి 11 గంటల 15 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. ఇది మొత్తం మూడు గంటల 19 నిమిషాల పాటు ఉంటుంది. సరిగ్గా మరుసటి రోజు అంటే జూన్ 6వ తేదీ తెల్లవారు జామున 2 గంటల 34 నిమిషాలకు ముగుస్తుందని టైమ్ అండ్ డేట్ డాట్ కామ్ ద్వారా తెలుస్తోంది. ఇక పూర్తి స్థాయి చంద్రగ్రహణం అర్థరాత్రి 12గంటల54 నిమిషాలకు కనిపిస్తుందని తెలుస్తోంది.

బ్లడ్ మూన్ అంటే ఏమిటి..?
చంద్రగ్రహణాలు మూడు రకాలు. సంపూర్ణ చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం, ప్రతిబింబ చంద్రగ్రహణం అని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ‘బ్లడ్ మూన్' అని పిలుస్తారు. గ్రహణ సమయంలో చంద్రుడు, భూమి నీడలోకి వెళ్ళడం వళ్ళ, సూర్యుడి నుండి వచ్చే కాంతి భూమికి చేరి, తర్వాత చంద్రుని మీద ప్రతిఫలిస్తుంది. దాంతో చంద్రుడు ఎరుపు రంగులో (రక్త వర్ణంలో) కనిపిస్తాడు. అందుకే దాన్ని 'బ్లడ్ మూన్' అంటారు.పాక్షిక చంద్రగ్రహణ సమయంలో చంద్రుడి ప్రతిబింబం కొద్దిగా వచ్చి.. చిన్నగా కనిపిస్తుంది. కానీ మూడు గ్రహణాలు మాత్రం సరళరేఖలో సమలేఖనం చేస్తే నీడ కనిపిస్తోంది. ప్రతిబింబ చంద్రగ్రహణం అంటే సూక్ష్మ నీడ ఉన్న ప్రాంతమైనందున చిన్నగా కనిపిస్తుంది.

చంద్రగ్రహణం నాడు అపోహలు
చంద్ర గ్రహణం సమయంలో గర్భవతులు బయట తిరిగితే కడుపులో శిశువుకు హాని జరుగుతుందని, ఏమీ తినకూడదని, గోళ్ళు గిల్లుకోకూడదని, ఏమీ తినకూడదని పూర్వం నుండి భారతదేశంలో నమ్మకం ఉంది. చంద్రగ్రహణం సమయంలో ఆహారం తీసుకుంటే ఆరోగ్యపరంగా అనర్థాలు జరుగుతాయనే అపనమ్మకం ఒకటుంది. ఇక టిబెట్లో గ్రహంణం వల్ల ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతుందని అక్కడి స్థానికులు భావిస్తారు. . చంద్రగ్రహణం సందర్భంగా సూర్యుడు, చంద్రుడు పోరాడుతున్నందున దక్షిణ అమెరికా ప్రజలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు. వారి సమస్య పరిష్కారమై విశ్వశాంతి జరగాలని వేడుంటారు ప్రార్థనలు చేస్తారు.