వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆకాశంలో అద్భుత ఆవిష్కరణ: లక్షలాది మందికి కనువిందు, విశాఖలో ఫస్ట్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఖగోళంలో బుధవారంనాడు ఆద్భుత ఆవిష్కరణ జరిగింది. సూపర్ బ్లూ బ్లడ్ మూన్ లక్షలాది మందికి కనువిందు చేసింది. భారతదేశంలో బుధవారం సాయంత్రం సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ప్రజలు ఆసక్తితో, ఉత్సాహంగా సందర్శించారు. భారతదేశంలో సాయంత్రం4.21 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది.

ఆకాశంలో చంద్రుడి అద్భుత దృశ్యాన్ని ప్రజలు వీక్షించారు. సాయంత్రం 6.25 నిమిషాలకు సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది. సాయంత్రం 7.37 గంటల వరకు భారతదేశంలో చంద్రగ్రహణం దర్శనమిచ్చింది.

Lunar Eclipse begins in India

సాయంత్రం 7.25 గంటల నుంచి చంద్రుడి పరిమాణం తగ్గుతూ వచ్చింది. భారత్‌లో సంపూర్ణ చంద్రగ్రహణం మాత్రం 5.25 గంటలకు ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో ముందుగా విశాఖపట్నంలో తొలుత చంద్రగ్రహణం దర్శనమిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి పెద్ద యెత్తున గుమికూడారు. అరకులోయ పర్యటనకు వచ్చిన ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు దాన్ని వీక్షించారు.

కోల్‌కతాలో సాయంత్రం 5.15 గంటలకు చంద్రగ్రహణం కనిపించింది. రోజూ కనిపించే కన్నా 30 శాతం పెద్దగా చంద్రుడు కనిపించాడు. సూపర్ బ్లూ బ్లడ్ మూన్ ఒకేసారి కనిపిస్తుండంతో ఈ అద్భుత దృశ్యాన్ని జారిపోకూడదని ప్రజలు భావించారు.

చంద్రగ్రహణం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆలయాలను మూసివేశారు. రేపు గురువారం సంప్రోక్షణ తర్వాత గుడుల తలుపులు తెరుస్తారు.

కొన్ని రాశులవారు చూడవద్దని జ్యోతిష పండితులు చెప్పినా విద్యార్థులు ఆకాశంలో అద్భుతాన్ని చూడడానికే ప్రాధాన్యం ఇచ్చారు. బిర్లా ప్లానిటోరియం సెంటర్‌‌ టెలిస్కోపుల ద్వారా దృశ్యాన్ని చూడడానికి పెద్ద యెత్తున తరలి వచ్చారు.

శ్రీకాళహస్తి ఆలయం మాత్రమే తెరిచే ఉంది. పూజారులు రాహువు, కేతువు పూజలు నిర్వహించారు.

హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, అధ్యాపకులు బజ్జీలు తింటూ చంద్రగ్రహణాన్ని వీక్షిస్తున్నారు. గ్రహణ సమయంలో ఏదైనా తింటే విషతుల్యమవుతుందనే వాదనను వారు ఖండించారు.

English summary
Lunar eclipse began in India. Visakha is the first witness Lunar clipse in Telugu state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X