వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రగ్రహణం, ఏం చేయాలి, ఏం చేయొద్దు, గ్రహణ సమయంలో తినొచ్చా.. గర్భవతులు ఏం చేయాలి..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

#LunarEclipse/Chandra Grahan 2020 : Why January 10 Lunar Eclipse Is Called Wolf Moon Eclipse

మరో రెండురోజుల్లో చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. గ్రహణం అంటేనే భారతీయులు కాస్త భయపడుతుంటారు. గ్రహణం సమయంలో ఏం చేయాలి ? ఎలా ఉండాలనే అని ఆందోళన చెందుతుంటారు. సూర్యగ్రహణం రోజున లేదంటే చంద్రగ్రహణమైనా సరే ఇబ్బందిపడుతుంటారు. శుక్రవారం సాయంత్రం చంద్రగ్రహణం ఏర్పడుతోంది.

గ్రహణం..

గ్రహణం..

శుక్రవారం సాయంత్రం 5.07 గంటల నుంచి చంద్రగ్రహణం ఏర్పడుతోందని నార్వేకి చెందిన ‘టైమ్అండ్‌డేట్.కామ్' సంస్థ తెలియజేసింది. 2020లో ఏర్పడబోతున్న మొదటి చంద్రగ్రహణం ఇది. ఈ ఏడాది మరో మూడు చంద్రగ్రహణాలు కూడా ఏర్పడబోతున్నాయి. జూన్ 5వ తేదీన, జూలై 5వ తేదీన, నవంబర్ 30వ తేదీన కూడా చంద్రగ్రహణం ఏర్పడుతుందని నార్వేకు చెందిన సంస్థ ‘టైమ్అండ్‌డేట్.కామ్' వెల్లడించింది.

మూడు రకాలు..

మూడు రకాలు..

చంద్రగ్రహణాలు మూడు రకాలు. సంపూర్ణ చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం, ప్రతిబింబ చంద్రగ్రహణం అని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ‘బ్లడ్ మూన్' అని పిలుస్తుంటాం. ఈ సమయంలో చంద్రుడు ప్రతిబింబం భూమి మధ్యలోకి వచ్చి నల్లని నీడ ఏర్పడుతుంది. పాక్షిక చంద్రగ్రహణ సమయంలో చంద్రుడి ప్రతిబింబం కొద్దిగా వచ్చి.. చిన్నగా కనిపిస్తోంది. కానీ మూడు గ్రహణాలు మాత్రం సరళరేఖలో సమలేఖనం చేస్తే నీడ కనిపిస్తోంది. ప్రతిబంబ చంద్రగ్రహణం అంటే సూక్ష్మ నీడ ఉన్న ప్రాంతమైనందున చిన్నగా కనిపిస్తోంది.

చంద్రగ్రహణం అంటే

చంద్రగ్రహణం అంటే

చంద్రుడు భూమి చుట్టూ కక్ష్యలో కదులుతాడు, అదే సమయంలో భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. కొన్నిసార్లు భూమి సూర్యుడు మరియు చంద్రుల మధ్య కదులుతుంది. ఇది జరిగినప్పుడు, సాధారణంగా చంద్రుడు ప్రతిబింబించే సూర్యకాంతిని భూమి అడ్డుకుంటుంది. చంద్రుని ఉపరితలంపై కాంతికి బదులు, భూమి నీడ దానిపై పడుతుంది. దీనినే చంద్ర గ్రహణం అని ఖగోళ శాస్త్రవేత్తలు పిలుస్తారు. చంద్రుడు నిండుగా కనిపించనప్పుడు మాత్రమే గ్రహణం వస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పేర్కొన్నది.

గ్రహణ సమయం

గ్రహణ సమయం

‘టైమ్అండ్‌డేట్.కామ్' ప్రకారం శుక్రవారం సాయంత్రం 5.07 గంటల నుంచి రాత్రి 10.37 గంటల వరకు గ్రహణం ఉంటుందని తెలియజేసింది. గ్రహణం గరిష్టంగా రాత్రి 7.10 గంటల నుంచి 11వ తేదీ 12.40 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నది. రాత్రి 9.12 గంటల నుంచి 11వ తేదీ 2.42 గంటల వరకు ఉంటుందని వెల్లడించింది. గరిష్టంగా చంద్రగ్రహణం 4 గంటల 5 నిమిషాలు ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

కనిపించేది ఇక్కడే..

కనిపించేది ఇక్కడే..

చంద్రగ్రహణాన్ని యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ అమెరికాలోని తూర్పు ప్రాంతం, ఫసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ ఖండంపై కనిపిస్తోందని చెప్పారు.

నేరుగా చూడొచ్చు

నేరుగా చూడొచ్చు

సూర్యగ్రహణం సమయంలో ప్రత్యేక అద్దాలు ధరించాలె తప్ప.. చంద్రగ్రహణానికి అలాంటి నియమాలు ఏమీ లేవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నేరుగా చంద్రగ్రహణాన్ని చూడొచ్చని సూచిస్తున్నారు.

గ్రహణ సమయం, అపోహలు
1. చంద్రగ్రహణ సమయంలో కూడా వంట చేయొద్దని, ఏం తినొద్దని, తాగొద్దనే వాదన పురాతన భారతీయ సమాజం నుంచి ఉంది. గ్రహణం సమయంలో ఆహారం తీసుకుంటే ఆరోగ్యపరంగా అనర్ధాలు జరుగుతాయా అనే భయం కూడా ఉంది.

2. ఇక అమెరికాలో అయితే బైబిల్ జోయెల్ 2:31 ప్రకారం ప్రభువు రాకముందే సూర్యుడు చీకటిగా, చంద్రుడు అరుణ వర్ణంలోకి మారతాడని అక్కడి శాస్త్రవేత్తలు చెప్తుంటారు.

3. టిబెట్‌లో అయితే గ్రహణంతో మంచితోపాటు చెడు కూడా పెరుగుతుందని స్థానికులు భావిస్తారు.

4. చంద్రగ్రహణం సందర్భంగా సూర్యుడు, చంద్రుడు పోరాడుతున్నందున దక్షిణ అమెరికా ప్రజలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు. వారి సమస్య పరిష్కరమై విశ్వశాంతి జరగాలని వేడుంటారు.

5. ప్రపంచంలోని చాలా చోట గర్భవతులు ఇంటిలోపల పడుకోవాలని సూచిస్తారు. చంద్రగ్రహణం వల్ల పుట్టబోయే బిడ్డకు మంచి జరగదని విశ్వసిస్తారు. అంతేకాదు చేతిలో కత్తి పట్టుకొవద్దని, ఇతర వస్తువులు కూడా ముట్టుకొవద్దని పెద్దలు చెప్తుంటారు.

English summary
According to Norway-based timeanddate.com Penumbral Eclipse will begin on January 10 at 5:07 pm and end at 10:37 pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X