వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళ నటిని పెళ్ళాడి లగ్జరీ లైఫ్, 17 ఏళ్లకే జైలుకు, ఎవరీ సుకేష్?

ఎన్నికల గుర్తు రెండాకుల కోసం ఎన్నికల సంఘం అధికారులకు రూ.50 కోట్లు లంచం ఇచ్చేందుకు అన్నాడిఎంకె డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్ తరపున సుకేష్ చంద్రశేఖర్ లంచం ఇచ్చేందుకు రావడంతో ఢిల్లీ పోలీసులు అరెస్

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై: ఎన్నికల గుర్తు రెండాకుల కోసం ఎన్నికల సంఘం అధికారులకు రూ.50 కోట్లు లంచం ఇచ్చేందుకు అన్నాడిఎంకె డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్ తరపున సుకేష్ చంద్రశేఖర్ లంచం ఇచ్చేందుకు రావడంతో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

అయితే సుకేష్ చంద్రశేఖర్ చాలా సుఖ పురుషుడుగా పేరుంది. ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో అన్నా డిఎంకెకు రెండాకుల గుర్తు రాకపోవడం ఆ పార్టీకి తీవ్రమైన నష్టం. అయితే ఈ నష్టాన్ని పూడ్చుకొనేందుకుగాను ఆ పార్టీ ప్రయత్నాలను ప్రారంభించింది.

అయితే జయలలిత మరణం తర్వాత పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయింది. పన్నీర్ సెల్వం, శశికళ గ్రూపులుగా పార్టీ విడిపోయింది. ఈ కారణంగానే ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో ఎన్నికల గుర్తు కోసం రెండు వర్గాలు ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించాయి.

అయితే రెండు గ్రూపులకు ఎన్నికల కమిషన్ పార్టీ ఎన్నికల గుర్తును కేటాయించలేదు. ఈ రెండు గ్రూపులకు వేర్వేరు గుర్తులను కేటాయించింది. ఈ ఎన్నికల్లో పార్టీకి అధికార గుర్తు దక్కకపోవడంతో శశికళ గ్రూపుకు తీవ్రమైన నిరాశను కల్గించింది.

ఎవరీ సుకేష్ చంద్రశేఖర్?

ఎవరీ సుకేష్ చంద్రశేఖర్?

సుకేష్ చంద్రశేఖర్ ఇంటర్మీడియట్ వరకే చదివాడు. 17 ఏళ్ల వయసులోనే తొలిసారిగా ఒక స్కాంలో ఇతగాడి పేరు బయటకు వచ్చింది. తన స్వంత ఊళ్లో బ్రోకర్ గా వ్యవహరిస్తూ ప్రభుత్వ కాంట్రాక్టులకు అమ్మేసేవాడు. అప్పటికీ మైనర్ కావడంతో అరెస్టు చేయలేదు పోలీసులు.కొంతకాలంపాటు జైల్లోనే ఉండి బెయిల్ తెచ్చుకొన్నాడు.

తమిళనాటిని పెళ్ళాడిన సుకేష్ చంద్రశేఖర్

తమిళనాటిని పెళ్ళాడిన సుకేష్ చంద్రశేఖర్

మద్రాస్ కేఫ్, బిర్యానీ లాంటి సినిమాల్లో నటించిన లీనా మేరీ పాల్ ను చంద్రశేఖర్ పెళ్ళి చేసుకొన్నాడు. కానీ, వీళ్ళిద్దరినీ 2015 సంవత్సరంలో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు కూడ కారణం మోసం చేయడమే తనకు కేంద్రంలో చాలా మందితో సంబంధాలున్నాయని తాను తలుచుకొంటే బెంగుళూరు జైలు నుండి శశికళను కూడ బయటకు రప్పించగలనని చెప్పుకొనేవాడట.

ఉత్తరాదికి వ్యాపారిని విస్తరించిన సుకేష్

ఉత్తరాదికి వ్యాపారిని విస్తరించిన సుకేష్

చిన్నతనంలోనే బ్రోకర్ గా వ్యవహరిస్తూ ప్రభుత్వ కాంట్రాక్టులను అమ్మేసేవాడు. అయితే ఈ కేసు నుండి బెయిల్ పై వచ్చిన సుకేష్ ఉత్తరాదికి వ్యాపారాన్ని విస్తరించాడు.

నకిలీ భీమా పాలసీలు అమ్ముతూ అతి తక్కువ కాలంలో 3 వేల కోట్లు సంపాదించాడు. తనకు తాను ఎంపీగా చెప్పుకోవడానికి నకిలీ ఐడి కార్డులు కూడ వాడేవాడట. అతడి దగ్గర సీజ్ చేసిన ఒక బీఏండబ్ల్యు , మెర్సిడిస్ కార్ల మీద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనే స్టిక్కర్ లైసెన్సులు ఉన్నాయి.

సుఖపురుషుడు సుకేష్ చంద్రశేఖర్

సుఖపురుషుడు సుకేష్ చంద్రశేఖర్

ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సుకేష్ చంద్రశేఖర్ సుఖ పురుషుడు. అతడి చేతికి రూ.6.5 కోట్ల విలువైన బ్రేస్ లెట్ ఉంది. బూట్లు, 1.3 కోట్ల రూపాయల నగదు, ఇంకా చాలా విలాసవంతమైన వస్తువులున్నాయి.

అన్నాడీఎంకె అభ్యర్థిగా ఆర్ కె నగర్ ఉప ఎన్నికల బరిలో నిలిచిన టీటీవి దినకరన్ తరపున ఎన్నికల కమిషన్ కు లంచం ఇచ్చేందుకు చంద్రశేఖర్ ఢిల్లీకి వచ్చాడని తెలిసి పోలీసులు అరెస్టు చేశారు.సుకేష్ లూయిస్ విట్టన్ చెప్పులు వేసుకొన్నాడు. అతడి మీద చెన్నై, బెంగుళూరు నగరాల్లో 12 కేసులున్నాయి.వాటిలో మోసం, ఫోర్జరీ ఇలా రకరకాలున్నాయి. ఢిల్లీలో చాలా ఫ్యాన్సీ ఫాంహౌస్ లున్నాయి. అతడి నెట్ వర్క్ పెద్దదని పోలీసులు చెబుతున్నారు.

నాలుగేళ్ళ నుండి దినకరన్ తెలుసు

నాలుగేళ్ళ నుండి దినకరన్ తెలుసు

అన్నాడీఎంకె ఉప ప్రధాన కార్యదర్శి టీటీవి దినకరన్ తనకు నాలుగేళ్ళ నుండి తెలుసునని సుకేష్ చంద్రశేకర్ పోలీసులకు చెప్పారు.నగరంలో నల్లధనం గురించి తమకు సమాచారం రావడంతో తాము సోదాలు చేసి చంద్రశేఖర్ ను అరెస్టు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.

ఢిల్లీలో పనిని మొదలుపెట్టేందుకుగాను సుకేష్ కు రూ.10 కోట్లు ఇచ్చాని సమాచారం.అయితే ఎన్నికల కమిషన్ అధికారుల వద్దకు ఈ లంచం ప్రతిపాదన ఏమైనా వెళ్ళిందా లేదా అనేది ఇంకా తేలలేదని పోలీసులు చెప్పారు.

English summary
Sukesh Chandrashekar luxuries addict man. he was involved many cases various states,he was arrested in when he studying intermediate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X