Luxury life:ఫేమస్ కాలేజ్ స్టూడెంట్స్, డ్రగ్స్ కు బానిసలు, రింగ్ లో రోడ్డులో డ్రగ్స్ తో కారులో !
బెంగళూరు: ప్రముఖ ప్రైవేట్ కాలేజ్ లో చదువుతున్న ఇద్దరు యువకులకు వాళ్ల కుటుంబ సభ్యులు ఖర్చుల కోసం బాగానే డబ్బులు ఇస్తున్నారు. ఇంట్లో డబ్బులు ఎక్కువగా ఇవ్వడంతో యువకులు డ్రగ్స్ సేవించడానికి బానిస అయ్యారు. విపరీతంగా డ్రగ్స్ సేవించడానికి బానిసలు అయిన ఇద్దరు అడ్డదార్లు తొక్కారు. రింగ్ రోడ్డులోకి కారులో వెళ్లి డ్రగ్స్ డీల్ చెయ్యడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కైపోయారు.
Lady:
ఆర్మీ
జవాన్
భార్య
మీద
గ్యాంగ్
రేప్,
వీడియోలు
తీసి
బ్లాక్
మెయిల్,
రూ.
లక్షలు
లూటీ,
ఆ
వీడియోతో!
ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని జయనగర్ 9వ బ్లాక్ లో ఉన్న మహావీర్ జైన్ కాలేజ్ చాలా మంది ప్రముఖుల పిల్లలు చదువుతున్నారు. ఇదే కాలేజ్ లో బెంగళూరులోని బిళేకహళ్లిలోని అనుగ్రహా లేఔట్ లో నివాసం ఉంటున్న మనోరంజిత్ బీకామ్ మూడో సంవత్సరం, బోమ్మనహళ్లిలో నివాసం ఉంటున్న సుగేస్ కుమారన్ అలియాస్ కుమారన్ (20) అనే యువకుడు బీఎంఎస్ చివరి సంవత్సరం చదువుతున్నారు.

మహావీర్ జైన్ కాలేజ్ లో చదువుతున్న మనోరంజింత్, కుమారన్ కు వాళ్ల కుటుంబ సభ్యులు ఖర్చుల కోసం బాగానే డబ్బులు ఇస్తున్నారు. ఇంట్లో డబ్బులు ఎక్కువగా ఇవ్వడంతో మనోరంజిత్, కుమారన్ డ్రగ్స్ సేవించడానికి బానిసలు అయ్యారు. కాలేజ్ కు డుమ్మా కొడుతున్న ఇద్దరూ స్నేహితులతో కలిసి డ్రగ్స్ సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. విపరీతంగా డ్రగ్స్ సేవించడానికి బానిసలు అయిన ఇద్దరు డబ్బులు సంపాధించడానికి డ్రగ్స్ విక్రయించడానికి సిద్దం అయ్యారు.
బెంగళూరు నగరంలోని బనశంకరి మూడవ స్టేజ్ లోని రింగ్ రోడ్డులోని హోసకరహళ్లిలో కారు నిలిపిన ఇద్దరూ డ్రగ్స్ విక్రయించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. మనోరిజంత్, కుమారన్ నుంచి ఖరీదైన కారు, ఐప్యాడ్, 50 గ్రాముల డ్రగ్స్ తో పాటు నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు అన్నారు. విలాసాలకు బానిసలు అయిన ఇద్దరూ డ్రగ్స్ సేవించడానికి డ్రగ్స్ విక్రయిస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు.