వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘‘ఇంటికెళ్లి వస్తామంటే కుదరదు.. ఇప్పుడే.. ఇక్కడే ఇవ్వాలి, ఇస్తేనే ఆపరేషన్ చేస్తా’’

మల్కన్‌గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఒక వైద్యుడు మానవత్వం మరిచి ప్రవర్తించాడు. నెలలు నిండి ప్రసవ వేదనతో ఆసుపత్రికి వచ్చిన ఓ గిరిజన యువతికి ఆపరేషన్ చేసేందుకు రూ. ఐదు వేలు లంచం డిమాండ్ చేశాడు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: మల్కన్‌గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఒక వైద్యుడు మానవత్వం మరిచి ప్రవర్తించాడు. జిల్లాలోని ఖోయిరాపుట్‌ సమితి బొండాంఘాట్‌లోని మందిలిపొడియా గ్రామంలోని బొండా తెగకు చెందిన గిరిజన మహిళ గురుసీసా రెండోసారి గర్భం దాల్చింది.

ఆమె కడుపులో కవలలు ఉన్నట్టు గ్రామంలో మంత్రసాని తెలిపింది. నెలలు నిండిన ఆమెను ప్రసవం కోసం మంగళవారం ఆమె భర్త, తమ్ముడు మల్కన్‌గిరి ఆస్పత్రికి తీసుకువచ్చారు.
ఆ సమయంలో విధుల్లో ఉన్న వైద్యుడు నిర్మల్‌నాయక్‌ ఆమెను పరీక్షించి వెంటనే ఆపరేషన్‌ చేయాలని చెప్పాడు.

guru-sisa

ఆపరేషన్ చేసేందుకు రూ. ఐదువేలు లంచం ఇవ్వాలని అతడు షరతు విధించడంతో ఏం చేయాలో తోచక గర్భిణితో పాటు భర్త, సోదరుడు అరగంట సేపు అలానే ఉన్నారు. గురుసీసాకు చికిత్స అందించమని వేడుకున్నా నిర్మల్ నాయక్ మనసు కరగలేదు.

'కనీసం రూ.మూడు వేలు అయినా ఇవ్వండి. ఇంటికెళ్లి వస్తామంటే ఊరుకోను.. ఇక్కడే, ఇప్పుడే డబ్బు ఇవ్వాలి..' అంటూ అతడు తెగేసి చెప్పడంతో గురుసీసా తమ్ముడు అక్కడ ఎవరినో అడిగి రెండు వేల రూపాయలు తెచ్చి ఇచ్చాడు. ఆ డబ్బు తీసుకున్న తరువాతే వైద్యుడు నిర్మల్ నాయక్ ఆమెకు ఆపరేషన్‌ చేశాడు.

పిల్లలు ఇద్దరూ క్షేమంగా పుట్టారు కానీ తక్కువ బరువు ఉండడంతో పిల్లలను ఐసీయూలో పెట్టారు. అయితే మిగతా మూడు వేలు ఇస్తేనే పిల్లలను అప్పగిస్తామని మళ్లీ డాక్టర్ నిర్మల్ నాయక్ తేల్చిచెప్పాడు. పైపెచ్చు 'డబ్బు ఇవ్వకపోతే పిల్లలు చనిపోయారని సర్టిఫికెట్‌ ఇస్తా..' అంటూ వారిని బెదిరించాడు.

స్పందించిన ఎమ్మెల్యే

దీంతో గురుసీసా భర్త వెంటనే మల్కన్‌గిరి ఎమ్మెల్యే మనాస్‌మడకామిని కలిసి విషయం తెలియజేశాడు. ఎమ్మెల్యే వెంటనే ఆస్పత్రికి చేరుకుని.. సీడీఎంఓ ఉదయ్‌ చంద్రమిశ్రా, ఎడీఎం రఘుమణి గొమాంగోలతో కలిసి ప్రసూతి వార్డుకు వచ్చి గురుసీసాను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. అలాగే పిల్లలను పరిశీలించారు.

సీడీఎంఓ ఉదయ్‌ చంద్ర మిశ్రో వెంటనే వైద్యుడు నిర్మల్‌నాయక్‌ను ఆ వార్డులో విధుల నుంచి తొలగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిర్మల్‌నాయక్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

'కలెక్టర్‌ అందుబాటులో లేరు. ఆయన వస్తే వైద్యుడ్ని సస్పెండ్‌ చేయిస్తాం..ఇకపై ఎక్కడా ఇలా ప్రవర్తించకుండా చేస్తాం..' అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మానాన్‌మాడకమి మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున అందాల్సిన పథకాలన్నీ త్వరలోనే గురుసీసాకు అందజేసి వైద్యునిపై చర్య తీసుకుంటామని చెప్పారు.

English summary
Bhubaneswar: Two days after he was transferred for allegedly taking Rs 5,000 bribe from a Bonda tribal woman for delivery, Dr Nirmal Chandra Nayak gynaecologist at the Malkangiri District Headquarters Hospital (DHH) has caused a flutter by returning the bribe to the woman. Nayak, who had taken Rs 5,000 bribe from Adibari Namni, a Bonda woman of Dantapada village in Bondaghati under Khairput block May 9 for delivery, returned the amount to the latter reportedly in the presence of the Malkangiri CDMO, other district officials and relatives of Namni.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X