చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గోపాలపురం నివాసానికి కరుణానిధి భౌతికకాయం: నివాళులర్పించిన రజినీకాంత్, మమత

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భౌతికకాయాన్ని కావేరి ఆసుపత్రి నుంచి గోపాలపురంలోని ఆయన నివాసానికి ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు. భౌతికకాయం తరలిస్తున్న అంబులెన్స్‌తో పాటు వేలాది మంది ఆయన అభిమానులు ప్రదర్శనగా కరుణ నివాసానికి చేరుకున్నారు.

సినీ-రాజకీయాల్లో చెరగని ముద్ర: ఎంజీఆర్ ఎంట్రీతో ప్రతిపక్షంలోనే!: కరుణానిధి ప్రస్థానంసినీ-రాజకీయాల్లో చెరగని ముద్ర: ఎంజీఆర్ ఎంట్రీతో ప్రతిపక్షంలోనే!: కరుణానిధి ప్రస్థానం

ఇంటి వద్ద కొన్ని క్రతువులు పూర్తయిన తర్వాత బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కరుణ భౌతికకాయాన్ని రాజాజీ హాల్‌కు తరలించనున్నారు. బుధవారం సాయంత్రం కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించనన్నట్లు డీఎంకే నేతలు వెల్లడించారు.

 M Karunanidhi Dies, Body Reaches Chennai House

రజినీకాంత్, మమత నివాళులు

గోపాలపురం నివాసంకు చేరిన కరుణానిధి భౌతికకాయానికి ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుతి తెలియజేశారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం రాత్రి చెన్నైకి చేరుకున్నారు. గోపాలపురం నివాసానికి చేరుకుని కరుణానిధి భౌతికకాయానికి నివాళులర్పించారు.

 M Karunanidhi Dies, Body Reaches Chennai House

నేడు ప్రధాని, ముఖ్యమంత్రుల రాక

కరుణానిధి భౌతికకాయానికి నివాళులర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం చెన్నైకి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, కేసీఆర్‌లు కూడా చెన్నైకి వెళ్లనున్నారు.

ఇన్ మెమరీస్: మనవడు బ్యాటింగ్ చేస్తే.. కరుణానిధి బౌలింగ్ చేశారిలా(వీడియో)ఇన్ మెమరీస్: మనవడు బ్యాటింగ్ చేస్తే.. కరుణానిధి బౌలింగ్ చేశారిలా(వీడియో)

English summary
M Karunanidhi, DMK patriarch and former Tamil Nadu Chief Minister, died on Tuesday in Chennai. He was 94. Hundreds of supporters escorted the ambulance carrying his body to his house. The Tamil Nadu government has announced a seven-day mourning in his honour. Schools and colleges will also remain closed on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X