వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంఆధార్ యాప్: బయోమెట్రిక్ డేటాను లాక్, అన్‌లాక్ చేయొచ్చు

మొబైల్‌లో ఆధార్‌కార్డు తీసుకెళ్ళేలా కొత్త యాప్‌ను తయారుచేసింది. ఎంఆధార్ పేరుతో దీన్ని ప్రారంభించారు. ఈ యాప్ కారణంగా మొబైల్‌లోనే ఆధార్‌ను తీసుకొనే వెసులుబాటు కలిగింది. ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫ్లా

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మొబైల్‌లో ఆధార్‌కార్డు తీసుకెళ్ళేలా కొత్త యాప్‌ను తయారుచేసింది. ఎంఆధార్ పేరుతో దీన్ని ప్రారంభించారు. ఈ యాప్ కారణంగా మొబైల్‌లోనే ఆధార్‌ను తీసుకొనే వెసులుబాటు కలిగింది. ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫామ్ అందరికీ అందుబాటులో ఉంటుంది.

ప్రతి దానికి ఆధార్‌కార్డు అవసరం లేదని సుప్రీంకోర్టు చెబుతున్నా కేంద్రం మాత్రం కొన్నింటికి ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకొంది. దీంతో ఆధార్ అనేది తప్పనిసరిగా మారింది. దీంతో ఆధార్ పర్స్‌లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

mAadhaar: Now carry Aadhaar on your mobile

మొబైల్‌లోనే ఆధార్‌కార్డ్‌ను తీసుకెళ్ళేలా యాప్‌ను తయారు చేశారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా ఓ యాప్‌ను తెచ్చింది. ఎంఆధార్ పేరుతో దీన్ని లాంచ్ చేసింది. దీంతో మొబైల్‌లోనే ఆధార్‌కార్డ్‌ను తీసుకెళ్ళవచ్చు. ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫామ్ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ ఆధార్ ప్రోఫైల్‌ను కలిగి ఉండడమే కాకుండా, ఈ యాప్ ద్వారా లింక్ అయ్యే ఆధార్ యూజర్లు తమ బయో‌మెట్రిక్ డేటాను లాక్, అన్‌లాక్ చేసుకోవచ్చు.

క్విక్ రెస్పాన్స్, కోడ్‌తో అప్‌డేటెడ్ ఆధార్ ప్రోఫైల్‌ను షేర్ చేయడానికి చూడటానికి ఇది ఉపయోగపడుతోంది. ఈకైవైసీ వివరాలను టెలికం కంపెనీల వంటి సర్వీస్ ప్రోవైడర్లకు షేర్ చేయవచ్చు. ఎంఆధార్ యాప్‌ను గూగుల్ ప్లే స్లోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ, ఆధార్‌తో లింక్ అయిన రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్ ద్వారానే సాధ్యపడుతోంది.

English summary
In a further push towards the 'Digital India' initiative, "mAadhaar" (a mobile-based interface) has been launched. The app developed by Unique Identification Authority of India (UIDAI) will carry demographic information like name, date of birth, gender and address along with the user's photograph and is linked with one's Aadhaar number. The app is currently available for Android users only. "LAUNCHING #mAadhaar- Carry your Aadhaar on your Mobile. The android app from UIDAI is now available on Google Play," a tweet from Aadhaar's verified account stated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X