• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సుష్మా పొలిటికల్ రిటైర్మెంట్‌పై స్వరాజ్ కౌశల్.. మీ వెనకాల పరుగెత్తేందుకు నేనేం యువకుడిని కాదు

|

న్యూఢిల్లీ : సుష్మ స్వరాజ్, స్వరాజ్ కౌశల్ అభిప్రాయ భేదాలు ఏ మాత్రం లేని భార్య భర్తలు. వీరిద్దరి 44 ఏళ్ల వైవాహిక జీవితంలో పొరపచ్చాలు వచ్చింది అరుదని సన్నిహితులు చెప్తుంటారు. ఓ భర్తగా భార్యను రాజకీయాల్లో ప్రోత్సహించారు కౌశల్. ఈ విషయాన్ని బహిరంగంగా సుష్మ కూడా అంగీకరించారు. అయితే రాజకీయాల్లో రిటైర్మెంట్ వచ్చేసరికి ఇద్దరు మనుషులు వెరైనా మనుసులు ఒక్కటే నిర్ణయం తీసుకున్నారు.

దివికేగిన చిన్నమ్మ.. కన్నిటీని బిగబట్టి అంత్యక్రియలు నిర్వహించిన బన్సూరి

చాలు.. ఇక పరుగెత్తలేను ..

చాలు.. ఇక పరుగెత్తలేను ..

25 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికైన సుష్మ స్వరాజ్ .. తర్వాత రాజకీయంగా దూసుకెళ్తున్నారు. 7 సార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో విదేశాంగ మంత్రిగా పనిచేసి ఆ పదవీకే వన్నె తీసుకొచ్చారు. ఈ క్రమంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు సుష్మ. దీనిపై ఆమె భర్త కౌశల్ సరదాగా స్పందించారు. రాజకీయాలకు సుష్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో యావత్ దేశం విస్మయం వ్యక్తం చేయగా .. కౌశల్ మాత్రం సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయనని నిర్ణయం తీసుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మేడం అని పేర్కొన్నారు.

ఆపాల్సిందే కదా ..

ఆపాల్సిందే కదా ..

మిల్కా సింగ్ కూడా ఏదో ఒకరోజు పరుగు ఆపాల్సిందేనని గుర్తుచేశారు. 25 ఏళ్ల వయస్సులో మీ పరుగు ప్రారంభమైంది. గత 41 ఏల్ల నుంచి కొనసాగుతోంది. మీతోపాటు నేను కూడా పరుగెత్తుతున్నాను అని గుర్తుచేశారు. ఇక పరుగెత్తడం నా వల్ల కాదు. ఎందుకంటే తాను 19 ఏళ్ల యువకుడిని కాదని .. ఓపిక లేదని చెప్పారు. పరుగు ఆపుతూ నిర్ణయం తీసుకున్నందుకు థాంక్స్ అని చెబుతూ .. ఇక నుంచి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటానని కౌశల్ చమత్కరించారు.

ఫ్యామిలీకి కూడా ప్రయారిటీ

ఫ్యామిలీకి కూడా ప్రయారిటీ

అంతేకాదు కౌశల్ అమ్మ 1993లో క్యాన్సర్ వ్యాధితో పోరాడి ఓడిపోయారు. ఆ సమయంలో సుష్మ స్వరాజ్ ఎంపీగా ఉన్నారని కౌశల్ చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్తకు సేవ చేయడానికి సహయకురాలిని నియమించాలని చాలా మంది సలహా ఇచ్చారు. కానీ అందుకు సుష్మ అందుకు అంగీకరించలేదు. ఏడాదిపాటు తన తల్లికి అన్ని సేవలు చేసిందని గుర్తుచేశారు. రాజకీయ నాయకురాలిగా బిజీగా ఉంటూనే కుటుంబం పట్ల ప్రేమ చూపించారని తెలిపారు. అంతేకాదు తన తండ్రికి తనకన్నా సుష్మ అంటేనే అభిమానం అని గుర్తుచేశారు. ఆయన చివరి కోరిక మేరకు ఆయనకు సుష్మనే తలకొరివి పెట్టిందని పేర్కొన్నారు.

కూతురితో అంత్యక్రియలు

కూతురితో అంత్యక్రియలు

హిందు సాంప్రదాయం ప్రకారం భర్త, లేదంటే కుమారుడు అంత్యక్రియలు నిర్వహించాలి. కానీ వారికి కుమారుడు లేనందున కూతురితో సుష్మ అంత్యక్రియలు జరిపించారు. భర్త స్వరాజ్ కౌశల్‌ నిర్వహించొచ్చు కానీ .. బన్సూరి అంటే సుష్మకు ఎనలేని ప్రేమ అని బంధువులు చెప్తున్నారు. అందుకోసమే ఆమెతో అంత్యక్రియల ఘట్టం ముగించారు. సుష్మ స్వరాజ్‌ను కడసారి చూసి భావోద్వేగానికి గురయ్యారు స్వరాజ్ కౌశల్, బన్సూరి. బంధుమితరుల ఆశ్రునయనాల మధ్య సుష్మ అంత్యక్రియలు ముగిసాయి. అంతకుముందు బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎండీహెచ్ వ్యవస్థాపకుడు గులాటీ తదితరులు అంజలి ఘటించారు.

English summary
Minutes after then foreign minister Sushma Swaraj in November 2018 announced her decision to keep off electoral politics citing health reasons, her husband and former governor Swaraj Kaushal thanked her. “Madam - Thank you very much for your decision not to contest any more elections. I remember there came a time when even Milkha Singh stopped running,” he said admiringly in a series of tweets to his wife, tracing her long career in electoral politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X