వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్రమ సంబంధం, పెళ్లికి అడ్డుపడుతున్న ప్రియురాలు, పక్కాప్లాన్ తో పని ముగించిన వ్యాపారి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరుం పదేపదే తన పెళ్లి రద్దు కావడానికి ఇంతకాలం అక్రమ సంబంధం కోసం ఉంచుకున్న ఉంపుడుగత్తె కారణం అంటూ రెచ్చిపోయిన వ్యాపారి ఆమెను దారుణంగా హత్య చేసి శవాన్ని తీసుకెళ్లి నది సమీపంలోని మునిసిపాలిటీ డ్రైనేజ్ లో విసిరేశాడు. మహిళ కనపడకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ కనపడటం లేదని కేసు నమోదు చేసిన పోలీసులు వివిద కోణాల్లో విచారణ చెయ్యగా ఆమె ప్రియుడి మీద అనుమానం వచ్చింది. మాయం అయిన మహిళ ప్రియుడిని పోలీసులు బెండ్ తీసి విచారణ చెయ్యగా ఆమె హత్యకు గురైన విషయం వెలుగు చూసిందని పోలీసులు తెలిపారు.

యువకులతో లింక్, జల్సాలు, భర్త పెట్రోల్ బంక్ యజమాని, కిడ్నాప్ చేయించి భార్య నాటకాలు!యువకులతో లింక్, జల్సాలు, భర్త పెట్రోల్ బంక్ యజమాని, కిడ్నాప్ చేయించి భార్య నాటకాలు!

మహిళ మీద వ్యాపారి కన్ను పడింది

మహిళ మీద వ్యాపారి కన్ను పడింది

కర్ణాటకలోని మండ్య నగరంలోని ఎంసీ రోడ్డులోని ప్లవర్ సర్కిల్ లో హిదాయత్ ఉల్లాఖాన్ (35) అరటికాయల మండీ నిర్వహిస్తున్నాడు. అరటికాయల వ్యాపారంలో హిదాయత్ ఉల్లాఖాన్ బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు. వ్యాపారి హిదాయత్ ఉల్లాఖాన్ కు ఇంకా పెళ్లి కాలేదు. వ్యాపారి హిదాయత్ ఉల్లాఖాన్ కన్ను మోబీనా (40) అనే మహిళ మీద పడింది.

మహిళతో అక్రమ సంబంధం

మహిళతో అక్రమ సంబంధం

మండ్యలోని పాత వీదిలో మోబీనా అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల నుంచి హిదాయత్ ఉల్లాఖాన్, మోబీనాకు పరిచయం ఉంది. హిదాయత్ ఉల్లాఖాన్, మోబీనా పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. మోబీనా ఇంటికి నిత్యం హిదాయత్ ఉల్లాఖాన్ వెళ్లేవాడు.

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి

ఎంతకాలం ఇలా అక్రమ సంబంధం సాగిస్తామని, మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామని మోబీనా ఆమె ప్రియుడు హిదాయత్ ఉల్లాఖాన్ కు చెప్పింది. ఇప్పుడు కాదు తరువాత పెళ్లి చేసుకుందాం అంటూ హిదాయత్ ఉల్లాఖాన్ ప్రియురాలికి మాయమాటలు చెప్పి తప్పించుకుంటున్నాడు.

వేరే పెళ్లి చేసుకోవాలని!

వేరే పెళ్లి చేసుకోవాలని!

మోబీనాను వదిలించుకుని వేరే అమ్మాయితో పెళ్లి చేసుకోవాలని హిదాయత్ ఉల్లాఖాన్ నిర్ణయించాడు. పెద్దల సహాయంతో హిదాయత్ ఉల్లాఖాన్ ఓ పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. విషయం తెలుసుకున్న మోబీనా ఆ పెళ్లి చెడగొట్టింది. తరువాత హిదాయత్ వేరే అమ్మాయితో పెళ్లి కుదుర్చుకున్నాడు. ఆ విషయం తెలుసున్న మోబీనా ఆ పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు తన అక్రమ సంబంధం విషయం చెప్పి పెళ్లి చెడగొట్టింది. ఇలా ఇప్పటి వరకు హిదాయత్ ఉల్లాఖాన్ పెళ్లిళ్లు చాల వరకు మద్యలోనే ఆగిపోయాయి.

చంపేస్తే పీడపోతుంది

చంపేస్తే పీడపోతుంది

పెళ్లి చేసుకోవాలని మోబీనా రోజురోజుకూ ప్రియుడు హిదాయత్ ఉల్లాఖాన్ మీద ఒత్తిడి ఎక్కువ చేసింది. ప్రియురాలు ఎక్కువ ఒత్తిడి చెయ్యడంతో హిదాయత్ ఉల్లాఖాన్ విసిగిపోయాడు. తనకు పెళ్లి కాకుండా ఇంత కాలం అడ్డుకుంటూ వచ్చింది తన ప్రియురాలు మోబీనా అని హిదాయత్ ఉల్లాఖాన్ కు తెలిసిపోయింది. ఎలాగైనా మోబీనా పీడవిరగడ చేసుకోవాలని, చంపేస్తే ఓపనైపోతుందని హిదాయత్ ఉల్లాఖాన్ ప్లాన్ వేశాడు. మోబీనాను హత్య చెయ్యడానికి పక్కా ప్లాన్ వేసుకున్నాడు.

సొంత మండీలోకి పిలిపించి!

సొంత మండీలోకి పిలిపించి!

గత నెల నవంబర్ 12వ తేదీ రాత్రి ప్రియురాలు మోబీనాను తన అరటికాయల మండీలోకి పిలిపించుకున్న హిదాయత్ ఉల్లాఖాన్ ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. తరువాత ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం హిదాయత్ ఉల్లాఖాన్ మోబీనా పంజాబీ డ్రస్ వేల్ తీసుకుని ఆమె గొంతు నులిమి హత్య చేశాడు.

బ్రాందీ షాప్ సీసీ కెమెరాల్లో!

బ్రాందీ షాప్ సీసీ కెమెరాల్లో!

ప్రియురాలు మోబీనా మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టిన హిదాయత్ ఉల్లాఖాన్ గుట్టుచప్పుడు కాకుండా దాన్ని స్కూటర్ లో తీసుకుని మండ్య నగర శివార్లలోని శింషా నది సమీపంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం రోడ్డులోని మునిసిపాలిటీ డ్రైనేజ్ కాలువలో విసిరేశాడు. ఇన్ని రోజుల నుంచి కనపడకుండా పోయిన మోబీనా మృతదేహం శింషా నది సమీపంలో బయటపడింది. మోబీనా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో అనుమానంతో హిదాయత్ ఉల్లాఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. మోబీనా మృతదేహం మూటకట్టి స్కూటర్ లో తీసుకు వెలుతున్న సమయంలో పాత రోడ్డులోని ఓ వైన్ షాప్ ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని పోలీసులు గుర్తించారు. తన పెళ్లి కూకుండా మోబీనా అడ్గుకుంటుందనే కోపంతో ప్రియుడు హిదాయత్ ఉల్లాఖాన్ ఆమెను హత్య చేశాడని విచారణలో వెలుగు చూసిందని, అతన్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

English summary
Bengaluru: Madduru police have arrested a man who murderer his lover Mobina (40) 15 days before in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X