చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిపిన్ రావత్ సతీమణి మధులికా రావత్‌ది ఓ రాజకుటుంబం, సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమిళనాడులోని కూనూర్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఆర్మీ హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో ఇండియా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ తోపాటు మరో 11 మంది ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలోనే బిపిన్ రావత్ దంపతులు మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది.

హెలికాప్టర్‌లో మొత్తం 14 మంది ఉండగా.. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, జనరల్ బిపిన్ రావత్ సతీమణి మధులికా రావత్.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శాష్దోల్ జిల్లాలోని సోహగ్‌పూర్ రాజకుటుంబానికి చెందిన మహిళ కావడం గమనార్హం. మధులికా తండ్రి పేరు కున్వర్ మృగేందర్ సింగ్. హెలికాప్టర్ ప్రమాద ఘటన సమాచారం అందిన వెంటనే మధులికా సోదరుడు యశ్వర్ధన్ సింగ్ భోపాల్ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు.

 Madhulika Rawat, Wife Of Bipin Rawat, Belonged To A Royal Family.

జనవరి 1, 2020లో బిపిన్ రావత్ భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)గా నియమితులయ్యారు. అయితే, రావత్ కుటుంబం ఎన్నో తరాలు భారత సైన్యంలోనే పనిచేస్తున్నాయి. ఆయన సతీమణి మధులికా ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్(ఏడబ్ల్యూడబ్ల్యూఏ)గా కొనసాగుతున్నారు. ఆర్మీ పర్సనల్ వ్యక్తుల భార్యలు, పిల్లల సంక్షేమం కోసం ఆమె పనిచేశారు.

మధుళిక తన చదువులను ఢిల్లీలోనే కొనసాగించారు. సైకాలజీ డిగ్రీని ఢిల్లీ యూనిర్సిటీలో ఆమె పూర్తి చేశారు. క్యాన్సర్ బాధితుల కోసం, ఇతర సేవా కార్యక్రమాల్లోనూ ఆమె ముందుండేవారు.

బిపిన్ రావత్, మధులిక దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒకరు కృతికా రావత్. బిపిన్ రావత్ తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ కూడా భారత సైన్యంలో పనిచేశారు. లెఫ్టినెంట్ జనరల్ పోస్టు వరకు ఆయన ఎదిగారు. ఆయన తల్లి ఉత్తరకాశీ నుంచి ఎమ్మెల్యే కిషన్ సింగ్ పరామర్ కూతురు కావడం గమనార్హం.

English summary
Madhulika Rawat, Wife Of Bipin Rawat, Belonged To A Royal Family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X