వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జయకు 16 ఏళ్ళు నేనే డమ్మీ అభ్యర్థి, అమ్మ ఆశీస్సులతో గెలుస్తా'

ఆర్ కె నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పన్నీర్ సెల్వం వర్గం నుండి ఎన్నికల బరిలో నిలిచిన మధుసూదన్ బుదవారం నాడు తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై: ఆర్ కె నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పన్నీర్ సెల్వం వర్గం నుండి ఎన్నికల బరిలో నిలిచిన మధుసూదన్ బుదవారం నాడు తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వచ్చే నెల 12వ, తేదిన ఆర్ కె నగర్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

ఆర్ కె నగర్ అసెంబ్లీ స్థానంలో విజయం కోసం అధికార, విపక్షాలు పెద్ద ఎత్తున కేంద్రీకరించాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఈ రెండు పార్టీలు తమ శక్తివంచన లేకుండా ప్రయత్నాలను ప్రారంభించాయి.

అన్నాడిఎంకె అభ్యర్థిగా దినకరన్ బరిలోకి దిగుతున్నారు.అయితే పార్టీ ఎన్నికల గుర్తు కేటాయించకపోతే ఆయన బదులు వేరే అభ్యర్థిని రంగంలోకి దింపుతారనే ప్రచారం కూడ లేకపోలేదు.

పన్నీర్ సెల్వం వర్గం నుండి మధుసూదన్ బరిలోకి దిగుతున్నారు. అన్నాడిఎంకె పార్టీ సంక్షోభ సమయంలో మధుసూధన్ పన్నీర్ సెల్వం గూటిలోకి చేరిపోయారు. ఆర్ కె నగర్ అసెంబ్లీ స్థానం నుండి పన్నీర్ ను బరిలోకి దింపారు.

జయకు 16 ఏళ్ళ పాటు డమ్మీ అభ్యర్థిని నేనే

జయకు 16 ఏళ్ళ పాటు డమ్మీ అభ్యర్థిని నేనే

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు తాను 16 ఏళ్ల పాటు డమ్మీ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశానని మధుసూదన్ గుర్తు చేసుకొన్నారు. జయలలిత తనను అంతగా నమ్మేవారని ఆయన చెప్పారు. అమ్మ ఆశీస్సులు తనకు ఉన్నాయని ఈ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తాననే ధీమాను వ్యక్తం చేశారు.అన్నాడిఎంకె గతంలో ఆయన ప్రిసీడియం చైర్మెన్ గా కూడ పనిచేశారు.అయితే శశికళను విబేధించి ఆయన పన్నీర్ వర్గంలోకి ఇటీవల చేరిపోయారు.

ఆర్ కె నగర్ లో ప్రచారాన్ని ప్రారంభించిన మధుసూధన్

ఆర్ కె నగర్ లో ప్రచారాన్ని ప్రారంభించిన మధుసూధన్

ఆర్ కె నగర్ లో బుదవారం నాడు మధుసూధన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.ఆర్ కె నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నేతాజీ నగర్, వినోభానగర్ తదితర ప్రాంతాల్లో ఆయన ఓటర్లను కలుసుకొని తనకు ఓటు వేయాలని కోరారు.ముస్లింలు నివసించే పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి ఓట్లు అభ్యర్థించారు.నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హమీ ఇచ్చారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు వ్యక్తి అన్నాడిఎంకె అభ్యర్థి

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు వ్యక్తి అన్నాడిఎంకె అభ్యర్థి

అన్నాడిఎంకె డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన వ్యక్తి అని మధుసూధన్ ఆరోపించారు. జయకు వ్యతిరేకంగా ఆయన దినకరన్ కార్యకలపాలను ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు.ఏళ్ళ తరబడి ఆయన పార్టీకి దూరంగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు.పార్టీ సభ్యత్వమే లేని ఆయనను శశికళ పార్టీలో చేరిన మరుక్షణమే పార్టీ పదవిని అప్పగించారని ఆరోపించారు మధుసూదన్.

బిజెపి అభ్యర్థి గంగై అమరన్ ప్రచారం

బిజెపి అభ్యర్థి గంగై అమరన్ ప్రచారం

ఆర్ కె నగర్ లో బిజెపి అభ్యర్థిగా బరిలో ఉన్న గంగై అమరన్ మంగళవారం నాడు పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. న్యూ వాషర్మెన్ పేటలోని పలు చోట్లకు వెళ్ళి తనకు ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు.అన్నాడిఎంకె అభ్యర్థులు దశాబ్దాల తరబడి పార్టీ కోసం త్యాగాలు చేసిన వారెందరో ఉన్నా వారిని ఆర్ కె నగర్ లోపోటీకి దింపకుండా దినకరన్ ను బరిలోకి దింపడాన్ని అమరన్ తన ప్రచారంలో ప్రస్తావించారు.దినకరన్ డబ్బులను ఖర్చుచేసి ఈ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

English summary
madhusudan started campaign in rk nagar assembly segment on Wednesday.madhusudan joined in panneer selvam group recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X