వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎట్టకేలకు మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ: ఐదుగురికి చోటు

|
Google Oneindia TeluguNews

భోపాల్: కరోనావైరస్ కారణంగా ఆగిపోయిన మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు మంగళవారం జరిగింది. రాజ్‌భవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లాల్జీ టాండన్ ఐదుగురు ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయించారు.

మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో నరోత్తమ్ మిశ్రా, గోవింద్ సింగ్ రాజ్‌పుత్, మీనా సింగ్, కమల్ పటేల్, తులసీరాం సిలావత్‌లు ఉన్నారు. కరోనా లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉండటంతో తక్కువ మందితో ఈ కార్యక్రమం జరిగినట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. కాగా, ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక్కరే కరోనా నియంత్రణపై సమీక్షలు నిర్వహించారు.

Madhya Pradesh: 5 ministers take oath in first round of cabinet expansion

కాగా, అంతకుముందు కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్యోతిరాధిత్య సింధియా వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించడంతో బలపరీక్షలో ఓడిపోయింది. దీంతో మార్చి 23న బీజేపీ అభ్యర్థిగా శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగోసారి మధ్యప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇక అప్పటి నుంచి చౌహాన్ ఒక్కరే కరోనా నియంత్రణ సమీక్షలు నిర్వహిస్తూ వైద్యారోగ్యమంత్రిగానూ విధులు నిర్వహించారు. దీంతో మంత్రివర్గ విస్తరణపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గంలోకి ఐదుగురికి చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు చౌహాన్.

English summary
Afive-member cabinet took oath on Tuesday in Madhya Pradesh, nearly a month after CM Shivraj Singh Chouhan was sworn in as Chief Minister for the fourth time on March 23.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X