వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మాయిలను సులభంగా ట్రాప్ చేయొచ్చు: బిజెపి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బిజెపి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంచిగా మాట్లాడితే అమ్మాయిలు పడిపోతారని ఆయన వ్యాఖ్యానించారు. నిర్ణీత వయస్సులోనే అమ్మాయిలకు వివాహలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తాను బాల్య వివాహలను ప్రోత్సహించనని చెబుతూనే ఆ వివాహలకు మద్దతుగా పరోక్షంగా మాట్లాడారనే విమర్శలు విన్పిస్తున్నాయి.

మంచిగా మాట్లాడితే అమ్మాయిలు కొత్త వాళ్ళతోనైనా ఇట్టే పడిపోతారని ఆయన చెప్పారు. ఈ తరహ ఘటనలు దేశంలో పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమ్మాయిలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అగర్‌మాల్వా నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే గోపాల్ పర్మర్ శనివారం పాల్గొన్నారు.

Madhya Pradesh BJP Lawmaker Suggests Child Marriage To Stop Love Jihad

మన ప్రభుత్వాలు అమ్మాయిలకు వివాహర్హత వయసును 18 ఏళ్లుగా నిర్ణయించాయి. కానీ, ఇప్పుడు అదే కొంప ముంచుతోంది. తియ్యటి మాటలకు మన అమ్మాయిలు సులువుగా వలలో పడిపోతారని చెప్పారు. . లవ్‌ జిహాదీ ఉదంతాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి, తల్లులు వారిని ఓ కంట కనిపెట్టాల్సిన అవసరం ఉంది. లవ్‌ జిహాద్‌ నుంచి దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉందని ఆయన మాట్లాడారు.

తనకు 12 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. అలాగని బాల్య వివాహాలను నేను ప్రొత్సహించను. 18 ఏళ్లలోపే అమ్మాయిలకు పెళ్లిళ్లు కుదిర్చండి. అప్పుడు వాళ్లకు ఎలాంటి తప్పుడు ఆలోచనలు రావన్నదే నా అభిప్రాయమని పర్మర్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై . శనివారం సాయంత్రం కొంత మంది విద్యార్థులు భోపాల్‌ హైవే పై ధర్నా చేపట్టారు. పర్మర్‌ క్షమాపణలు చెప్పాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

English summary
A Bharatiya Janata Party (BJP) lawmaker from Madhya Pradesh, who believes that "late marriages" are the reason behind "love jihad", a term used by right wing groups for a relationship between a Hindu woman and a Muslim man, has advised parents to marry off their daughters "on time".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X