వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ సర్కార్..బేఫికర్: ఆధిక్యత: కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోసినా: సింధియా మంత్రాంగం

|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ ఆధిక్యతను సాధిస్తోంది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్తోంది. ప్రారంభ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వెలువడుతున్నాయి. ఈ రేసులో కాంగ్రెస్ వెనుకంజలో ఉంది. మెజారిటీ స్థానాలను బీజేపీ దక్కించుకోగలిగితే..ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి ఢోకా ఉండదు. బేఫికర్‌గా ఉండొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి, గద్దెనెక్కినప్పటికీ.. బీజేపీకి ఆదరణే లభిస్తోంది. మెజారిటీ స్థానాలు దక్కేలా కాంగ్రెస్ మాజీ నేత, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా మంత్రాగం ఫలించినట్టే.

కరోనా ఎఫెక్ట్‌తో భారీగా బ్యాలెట్లు: లీడ్‌లో యాదవ్ బ్రదర్స్: పోటాపోటీగా: మేజిక్ ఫిగర్‌కు దూరంకరోనా ఎఫెక్ట్‌తో భారీగా బ్యాలెట్లు: లీడ్‌లో యాదవ్ బ్రదర్స్: పోటాపోటీగా: మేజిక్ ఫిగర్‌కు దూరం

మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా, ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరడం వల్ల ఉప ఎన్నికలను నిర్వహించాల్సి వచ్చింది. మొత్తం 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. వాటి ఫలితాలు మంగళవారం వెలువడుతున్నాయి. ప్రారంభ ఫలితాల్లో బీజేపీ 17 స్థానాల్లో, కాంగ్రెస్ ఏడు చోట్ల ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నాయి. మరో నాలుగు స్థానాలకు సంబంధించిన తొలి ఫలితాలు వెలువడాల్సి ఉంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున.. ఉప ఎన్నికల ఫలితాలు సహజంగానే ఆ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉందంటూ వేసిన అంచనాలు నిజం అవుతున్నాయి.

Madhya Pradesh: BJP Leads and Congress behind as Early Trends in By-elections

శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం అధికారంలో కొనసాగాలంటే ఉప ఎన్నికల్లో కనీసం తొమ్మిది స్థానాలను గెలవాల్సి ఉంది. అది లాంఛన ప్రాయమేనని ప్రారంభ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 230 స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 114 స్థానాలు అవసరం. ప్రస్తుతం చౌహాన్ ప్రభుత్వానికి 107 మంది సభ్యుల బలం ఉంది. ఈ ఉప ఎన్నికల సందర్భంగా ఆ మిగిలిన సీట్ల లోటును భర్తీ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరీ డెడ్ ఫిగర్ కాకుండా.. స్థిరంగా పరిపాలన అందించాలంటే మెజారిటీ స్థానాలను దక్కించుకోవడంపై కన్నేసింది. ఆ దిశగా విజయం సాధించేలా ఉంది.

Recommended Video

Election Results 2020:బిహార్ తో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 57 ఉపఎన్నికల ఫలితాలు|#Biharelectionresults

జ్యోతిరాదిత్య సింధియా, ఆయన వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వల్ల ఇదివరకు ఉన్న కమల్‌నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి ముందే రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడీ ఉప ఎన్నికలు ఆయన ప్రభుత్వానికి ఊపిరి పోసినట్టే. మెజారిటీ స్థానాలను ఆ పార్టీ దక్కించుకునే దిశగా దూసుకెళ్తోంది.

English summary
The results to the 28 bye-elections in Madhya Pradesh will be declared Tuesday. The polls were necessitated after 25 MLAs of the erstwhile Congress government switched over to the BJP in March 2020, leading to the fall of Kamal Nath’s 15-month-old government. Three seats were left vacant after the deaths of sitting legislators.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X