వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమల్ నాథ్Xజ్యోతిరాదిత్య సింధియా: సీఎం అభ్యర్థిని తేల్చనున్న రాహుల్ గాంధీ

|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక గగనం అయింది. జ్యోతిరాదిత్య సిందియా, కమల్‌నాథ్‌లలో ఎవరిని చేయాలనే అంశంపై పార్టీ ఎంపీలు తేల్చుకులేకపోయారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎల్పీ భేటీ జరిగింది. ఈ భేటీలో కాంగ్రెస్ ఎల్పీ పైన నిర్ణయం తీసుకోలేదు. అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని అధిష్టానానికి అప్పగించారు.

మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కార్యకర్తల సంబురాలు

అయితే, ఓ సమయంలో కమల్ నాథ్ అభ్యర్థిత్వాన్ని జ్యోతిరాదిత్య సింధియా ప్రపోజ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత మళ్లీ ఎమ్మెల్యేలు అధిష్టానానికి అప్పగించినట్లుగా తెలిసింది.

Madhya Pradesh: CM Kamal Nath or CM Jyotiraditya Scindia? MLAs leave it to Rahul Gandhi to decide

ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను కాంగ్రెస్‌ అధ్యక్షులు రాహుల్ గాంధీకి అప్పగిస్తూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ శాసన సభా పక్షం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు ఈ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేత శోభా ఓజా మీడియాకు తెలిపారు. కాగా, ముఖ్యమంత్రిగా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి కమల్‌నాథ్ వైపే కాంగ్రెస్‌ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.

మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 114, బీజేపీ 109, బీఎస్పీ 2, ఎస్పీ, ఒకటి, ఇతరులు నాలుగు స్థానాల్లో గెలిచారు. బీఎస్పీ మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకుని ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని చెప్పింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ఇప్పటికే గవర్నర్‌ ఆనందీబెన్‌ను కాంగ్రెస్‌ నేతలు కోరారు. ఆమె కూడా కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించారు.

Madhya Pradesh: CM Kamal Nath or CM Jyotiraditya Scindia? MLAs leave it to Rahul Gandhi to decide
English summary
The Congress Legislature Party has decided to leave it to party president Rahul Gandhi to take a call on the next chief minister of Madhya Pradesh. Congres leader Shobha Oza said in Bhopal: "All the MLAs have unanimously decided that a decision on the Chief Minister (of Madhya Pradesh) will be taken by Rahul Gandhi ji."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X