వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్ జరిగిందని ఫిర్యాదు చేస్తే పట్టించుకోరా... ఆ పోలీసులను అరెస్ట్ చేయండి... సీఎం సంచలన ఆదేశాలు...

|
Google Oneindia TeluguNews

అత్యాచార ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిన పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన ఆదేశాలిచ్చారు. గొటిటోరియా పోలీస్ అవుట్‌పోస్ట్ ఇన్‌చార్జితో పాటు అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ మిశ్రిలాల్ గోపాడేలను అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఇటీవల 32 ఏళ్ల ఓ మహిళ తనపై జరిగిన అత్యాచారంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా... వారివైపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరకు బాధితురాలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చౌహన్ సంచలన ఆదేశాలిచ్చారు.

మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలు...

మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలు...


నర్సింగ్‌పూర్ అడిషనల్ ఎస్పీ రాజేష్ తివారీ,గదర్వారా సబ్ డివిజనల్ పోలీస్ ఎస్ఆర్ యాదవ్‌లపై కూడా సీఎం చౌహాన్ వేటు వేశారు. పోలీసుల నిర్లక్ష్యంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఎస్పీ అజయ్ సింగ్‌కు నోటీసులు జారీ చేశారు. తక్షణం గ్యాంగ్ రేప్ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 'రేపిస్టులు మనుషుల రూపంలో ఉన్న దెయ్యాల లాంటివాళ్లు... నాగరిక సమాజంలో అలాంటివాళ్లు ఉండకూడదు... వాళ్లు చేసిన నేరానికి కఠిన శిక్ష పడి తీరుతుంది. నిందితులెవరైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు...' అని చౌహాన్ స్పష్టం చేశారు.

ఘటన ఎలా జరిగింది....

ఘటన ఎలా జరిగింది....

నర్సింగ్‌పూర్‌ గ్రామానికి చెందిన 32 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సెప్టెంబర్ 28న అత్యాచారానికి పాల్పడ్డారు. పశువుల కోసం గడ్డి కోసుకొచ్చేందుకు పొలానికి వెళ్లిన సమయంలో ఆమెపై ఘాతుకానికి పాల్పడ్డారు.ఘటనపై అదేరోజు బాధితురాలు తన భర్తతో కలిసి గొటిటోరియా పోలీసులకు ఫిర్యాదు చేయగా... అక్కడ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. పైగా సెప్టెంబర్ 30న బాధితురాలి భర్తను,ఆమె బావను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు.

అవమానంతో ఆత్మహత్య

అవమానంతో ఆత్మహత్య


ఇదే క్రమంలో అక్టోబర్ 2న మంచినీళ్లు తీసుకొచ్చేందుకు వెళ్లిన ఆ మహిళను... పొరుగునే ఉండే ఇద్దరు మహిళలతో పాటు,ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడి తండ్రి తీవ్ర అవమానానికి గురిచేశారు. తట్టుకోలేకపోయిన బాధితురాలి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలు చనిపోయాక గానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిన పోలీసులను అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.

Recommended Video

#Watch PM Narendra Modi Inaugurates Atal Tunnel at Rohtang వాజ్‌పేయ్‌ కల సాకారం..!! || Oneindia
కమల్‌నాథ్ విమర్శలు...

కమల్‌నాథ్ విమర్శలు...

మధ్యప్రదేశ్‌లో వరుస అత్యాచార ఘటనలపై మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'బీజేపీ పాలిత రాష్ట్రాల్లో భేటీ బచావో.. భేటీ పడావో నినాదం అసలు స్వరూపం ఇదే... ఉత్తరప్రదేశ్‌ తర్వాత దేశంలో మధ్యప్రదేశ్‌లోనూ అంతే స్థాయిలో మహిళలపై అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కర్గోనే,సాత్నా,జబల్‌పూర్ ఘటనల తర్వాత ఇప్పుడు నర్సింగపూర్‌లో మరో దళిత యువతి బలైపోయింది. అధికారులంతా ఎందుకు చోద్యం చూస్తున్నారు... నిందితులపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు...' కమల్‌నాథ్ అని ప్రశ్నించారు.

English summary
In a rare stern action, Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan has directed immediate arrest of a police officer in Narsinghpur district, who had failed to register complaint of a dalit-gang rape victim for three days. The woman killed herself on Friday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X