వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో .. ఎన్నికల ఫలితాలతో హార్ట్ స్ట్రోక్, కాంగ్రెస్ నేత మృతి

|
Google Oneindia TeluguNews

లక్నో : ఎన్నికల ఫలితాల టెన్షన్ నేతల్లో ఎక్కువ. కానీ గుండె బలహీనంగా ఉన్న ఓ నేత కౌంటింగ్ కేంద్రం వద్ద .. ప్రాణం తీసుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన ఘటనలో కాంగ్రెస్ నేత రతన్ సింగ్ ఆకస్మికంగా మృతిచెందాడు.

దీదీ కోటలో వికసించిన కమలం..! బెంగాల్ లో ప్రభంజనం సృష్టించిన మోదీ..!!దీదీ కోటలో వికసించిన కమలం..! బెంగాల్ లో ప్రభంజనం సృష్టించిన మోదీ..!!

ఫలితాల సందర్భంగా విషాదం ..
ఎన్నికల ఫలితాల సందర్భంగా మధ్యప్రదేశ్‌లో విషాదం జరిగింది. భోపాల్‌లో ఓ కౌంటింగ్ కేంద్రం వద్దకు సిహోర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రతన్ సింగ్ వెళ్లారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర వస్తున్న ట్రెంట్ గురించి తెలుసుకున్నాడు. తమ అభ్యర్థిపై ఓట్ల శాతం చూసి షాక్ తిన్నాడో ఏమో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే సమీప ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. రతన్ సింగ్ చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు. మరోవైపు తమ ఇంటి పెద్ద చనిపోవడంతో ఆ కుటుంబం రోదిస్తుంది. ఎన్నికల ఫలితాల వేళ ఆ ఫ్యామిలీ పెద్ద దిక్కును కోల్పోవడం అక్కడున్న వారిని కలచివేసింది.

Madhya Pradesh Congress leader dies of heart attack at counting centre as results come in

ఎంపీలో బీజేపీ హవా
మధ్యప్రదేశ్‌లో 29 చోట్ల కమలం వికసించింది. కమల వికసానికి హస్తం కనుచూపుమేరలో లేకుండా పోయింది. ఇటు దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని సాధించింది. గతంలో ఏ కూటమి సాధించని 350 సీట్లు కైవసం చేసుకొని రికార్డు సృష్టించింది. హిందీ బెల్ట్‌లో ఎన్డీఏ కూటమి ఎక్కువ సీట్లు సాధించింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా 4 సీట్లు గెలుచుకుంది.

English summary
in a tragic incident, the Congress chief of Sehore district in Madhya Pradesh died of a heart attack at a vote counting centre set up for the Lok Sabha elections. Ratan Singh Thakur, chief of Congress in Sehore district of Madhya Pradesh, was reportedly collecting information on the latest trends when he complained of chest pain and collapsed. Ratan Singh was rushed to the district hospital but he died at the hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X