వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేమంతా కలిసే ఉన్నాం.. మమ్మల్నేం చేయలేరు... సీఎం లంచ్ మీటింగ్

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజకీయా సంక్షోభానికి తెర లేపుతున్న నేపథ్యంలో ఓవైపు కర్ణాటక మరోవైపు గోవాల్లో పార్టీకి తీవ్ర నష్టం జరిగడంతో అధికార మార్పిడి జరుగుతున్న పరిస్థితి. దీంతో మధ్యప్రదేశ్‌లో ఉన్న కమల్‌నాథ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. రెండు రాష్ట్రాలను తాకిన రాజీకీయ అసంతృప్తి తమ ఎమ్మెల్యేలకు కూడ తాకకుండా జాగ్రత్త పడ్డాడు. తామంతా కలిసే ఉన్నామని తెలిపేందుకు మాజీ కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియాతోపాటు సీఎం కమల్‌నాథ్ పార్టీ నేతలతో కలసి డిన్నర్‌లో పాల్గోన్నారు.

ముందు జాగ్రత్త చర్యగా సీఎం లంచ్ మీటింగ్

ముందు జాగ్రత్త చర్యగా సీఎం లంచ్ మీటింగ్

ప్రస్థుతం మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షపార్టీలైన ఎస్పి,బీఎస్పీ పార్టీల సభ్యులతో కలసి 121 మంది సభ్యులు ప్రభుత్వానికి మద్దుతు తెలుపుతున్నారు. కాగా బీజేపీ ఇటివల జరిగిన ఎమ్మెల్యే ఇద్దరు ఎంపీ అభ్యర్థులుగా ఎన్నికయ్యారు. దీంతో ఆపార్టీ సంఖ్య 108కి చేరింది.అయితే ప్రస్థుతానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎలాంటీ ముప్పు లేనప్పటికి మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా వర్గానికి చెందిన మంత్రులతో ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మధ్య కొంత విభేధాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది.

అంసతృప్త నేతల బుజ్జగింపు...

అంసతృప్త నేతల బుజ్జగింపు...

ఈ నేపథ్యంలోనే నేతల మధ్య యూనిటి కోసం సీఎం కమల్‌నాథ్ మంత్రులు, పార్టీ కీలక నేతలతో పాటు ఎమ్మెల్యేలతో లంచ్ సమావేశాన్ని ఎర్పాటు చేశారు. కాగా ఈ సమావేశానికి జ్యోతిరాధిత్య సింధియాతోపాటు మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌లు పాల్గోన్నారు. అనంతరం ప్రత్యేకంగా రాత్రి జ్యోతిరాధిత్య సింధియాతోపాటు ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌లు సైతం ఓ మంత్రి నివాసంలో డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడ వెలువడ్డాయి.

మధ్యప్రదేశ్‌లో పార్టీల బలబలాలు..

మధ్యప్రదేశ్‌లో పార్టీల బలబలాలు..

ఇక మధ్యప్రదేశ్‌లో జరిగిన 2018లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 230 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ స్వంతగా 114 స్థానాలను గెలుచుకోగా, ఎస్పీ,బీఎస్పీలతోపాటు ఇండిపెండెంట్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ బలాబలాలను చూస్తే కాంగ్రెస్ పార్టీకి 114, బీఎస్పీకి 2 స్థానాలు, ఎస్పీ ఒక్క స్థానం,నలుగురు ఇండిపెండెంట్‌లతో కలిసి మొత్తం 121 మంది సభ్యులు ఉన్నారు.కాగా మెజారిటికి అయిదుగురు సభ్యులు మాత్రమే ఎక్కువగా ఉన్నారు. కాగా బీజేపీకి 108 స్థానాలు ఉన్నాయి. కాగా ఒక స్థానం ఖాలీగా ఉంది.

English summary
At a time when the Congress government is facing crisis in Karnataka and the Congress legislative party in Goa is in shambles, Madhya Pradesh Chief Minister Kamal Nath and former Union minister Jyotiraditya Scindia sought to sent out a strong message of unity from Bhopal by bonding over food.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X