వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus:అన్నీ తానే అయిన సీఎం, 25 సార్లు వీడియో కాన్ఫరెన్స్.. పరిస్థితిని చక్కదిద్దిన చౌహాన్..

|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్‌లో ఇటీవలే బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణం చేశారు. మంత్రివర్గం ఏర్పడలేదు. కానీ వైద్యారోగ్యశాఖ బాధ్యతలను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రిగా కన్నా వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఎక్కువగా పనిచేస్తున్నారు. రేయనగా.. పగలనక సమీక్షిస్తూనే.. పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు.

పశ్చిమ ప్రాంతం..

పశ్చిమ ప్రాంతం..

మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో 97 శాతం కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఇతర ప్రాంతాలు సులువుగా తప్పించుకోవడం వీలుకాదు. దీంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ రంగంలోకి దిగారు. కరోనా వైరస్ నిర్మూలన కోసం దాదాపు 25 సార్లు వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. పరిస్థితిని ఎప్పటికప్పడు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్పరెన్స్ కోసం 58 గంటలకు పైగా సమయం కేటాయించారంటే.. వైరస్ నిర్మూలనపై సీఎం ఎంత దృష్టిసారించారో అర్థమవుతోంది.

 సీఎం ఒక్కరే..

సీఎం ఒక్కరే..

నంబర్ గేమ్ ఆధారంగా మధ్యప్రదేశ్‌లో అధికారం కాంగ్రెస్ నుంచి బీజేపీకి మారింది. అయితే ముఖ్యమంత్రి ఒక్కరే ఉన్నారు. మంత్రివర్గం, వైద్యారోగ్యశాఖ మంత్రి లేరు. దీంతో పరిస్థితిని సీఎం నిరంతరం పరిశీలిస్తున్నారు. ఇందులో రాజకీయాలకు తావులేకుండా.. అధికారులతో సంప్రదింపులు జరిపి పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే కన్నా ఎక్కువగా శ్రద్దతో సీఎం పనిచేయడం సానుకూల అంశం. సీఎం పనితీరుపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

రోజుకు 10 వేల కిట్లు

రోజుకు 10 వేల కిట్లు

వైరస్ ప్రభావం నేపథ్యంలో పీపీపీ కిట్లు, ఎన్ 95 మాస్క్ ‌లను తగినంత అందుబాటులో ఉంచామని రాష్ట్ర అదనపు వైద్యారోగ్య కార్యదర్శి మహ్మద్ సులేమాన్ పేర్కొన్నారు. స్థానికంగా రోజుకు 10 వేల కిట్లను ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు. ఇండోర్ సమీపంలో గల పితంపూర్ వద్ద ఫ్యాక్టరీ నెలకొల్పి.. ఉత్పత్తి చేస్తున్నామని.. ఇప్పటికే లక్షల సంఖ్యలో పంపిణీ చేశామని చెప్పారు. ప్రభుత్వం వద్ద 9.5 లక్షల హైడ్రాక్సి క్లోరోక్విన్ మందులు ఉన్నాయని చెప్పారు. కరోనా వైరస్ సోకిన వారి కోసం 25 ప్రత్యేక ఆస్పత్రులు ఉన్నాయని.. 66 ఆరోగ్య కేంద్రాలు, 400 కోవట్ సర్వీస్ సెంటర్లు ఉన్నాయని చెప్పారు.

రోజుకు 1800 పరీక్షలు

రోజుకు 1800 పరీక్షలు

ఇదివరకు కరోనా వైరస్ పరీక్ష రోజుకు కొన్ని మాత్రమే చేసేవారమని.. 200 నుంచి 300 చేసేవారమని తెలిపారు. అవి 1600 నుంచి 1800కు చేరుకుందని తెలిపారు. 14 ప్రైవేట్ ల్యాబులలో కూడా పరీక్షలు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 1407 పాజిటివ్ కేసులు కాగా.. 47 మంది చనిపోయారని వివరించారు.

Recommended Video

Coronavirus : Swiggy Delivery Boy In Hyderabad Tests Positive For Covid-19

English summary
Shivraj Singh Chouhan government’s handling of the coronavirus outbreak and the lockdown in Madhya Pradesh is the perfect example of how not to handle a health crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X