• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తండ్రికి ‘పరీక్ష’: కుమారుడ్ని ఎక్కించుకుని 200 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు!

|

భోపాల్: కరోనా మహమ్మారి కారణంగా దేశంలోనే అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో అయితే, తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనేక పాట్లు పడ్డారు. పిల్లల కోసం తల్లిదండ్రులు, తల్లిదండ్రుల కోసం పిల్లలు వందలాది కిలోమీటర్లు కాలికడనక కొందరు, సైకిళ్ల మీద కొందరు, మరికొందరు ద్విచక్ర వాహనాల మీద ప్రయాణించారు.

దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా: జనాభాలో సగానికి సగం మందికి: 26%: ప్రభుత్వ లెక్కల కంటే

కుమారుడి కోసం తండ్రి సాహసం..

కుమారుడి కోసం తండ్రి సాహసం..

క్రమంగా లాక్‌డౌన్ నిబంధనలను సడిస్లున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పాఠశాలలు ప్రారంభించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల వాయిదా పడిన పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదంతా ఎందుకంటే.. ఓ తండ్రి చేసిన సాహసం తెలియజేయడం కోసమే. తన కుమారుడు పరీక్ష రాసేందుకు అతడ్ని ఎక్కించుకుని ఏకంగా 100 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లడం గమనార్హం. తాను చదువుకోకపోయిన తన కుమారుడు బాగా చదవాలనే కోరికతో తన శ్రమను లెక్కచేయలేదు.

105 కిలోమీటర్ల దూరంలోని పరీక్ష కేంద్రానికి సైకిల్‌పై..

105 కిలోమీటర్ల దూరంలోని పరీక్ష కేంద్రానికి సైకిల్‌పై..

మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. కూలిపనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న శోభారామ్ అనే వ్యక్తికి పదవ తరగతి చదివే కుమారుడు ఆశీష్ ఉన్నాడు. ఆశీష్‌కు సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్ నిబంధనలను క్రమంగా ఎత్తివేస్తున్నప్పటికీ ఈ ప్రాంతంలో మాత్రం పూర్తిస్థాయి ప్రజా రవాణా అందుబాటులోకి రాలేదు. దీంతో 105 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరీక్ష కేంద్రానికి తన కుమారుడ్ని ఎలా తీసుకెళ్లాలని మదన పడ్డాడు తండ్రి.

కొడుకు కోసం.. మొత్తం 200 కిలోమీటర్లకు పైగా...

కొడుకు కోసం.. మొత్తం 200 కిలోమీటర్లకు పైగా...

ఎవరైనా తన కుమారుడ్ని పరీక్ష కేంద్రంలో చేర్చేందుకు సాయం చేస్తారని ప్రయత్నించాడు శోభారామ్.. అయితే, ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చేసేదేమీ లేక తన దగ్గర ఉన్న సైకిల్‌పైనే తన కుమారుడ్ని చేర్చాలనుకున్నాడు. ఈ క్రమంలోనే తన కుమారుడ్ని సైకిల్‌పై ఎక్కించుకుని 105 కిలోమీటర్ల దూరంలోని ధార్ పట్టణానికి చేరుకున్నాడు. కుమారుడు పరీక్షలు రాసిన తర్వాత తిరిగి తన సైకిల్‌పైనే తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు ఆ తండ్రి.

  Sushant Singh Rajput : సుశాంత్ సూసైడ్ కేసు.. ఈడీ కార్యాలయం లో ప్రత్యక్షమైన రియా చక్రవర్తి!
  పెద్ద అధికారినవుతానంటూ కుమారుడు..

  పెద్ద అధికారినవుతానంటూ కుమారుడు..

  కాగా, మంగళవారం పరీక్ష రాయాల్సి ఉండగా.. సోమవారం సాయంత్రమే ఈ తండ్రీకొడుకులు సైకిల్‌పై బయల్దేరారు. రాత్రి మండవలోనే బస చేసి మంగళవారం ఉదయం సరైన సమయానినే పరీక్షా కేంద్రానికి చేర్చాడు. కాగా, ఇప్పటికే గణితం, సోషల్ సైన్సెస్ పరీక్షలను రాసినట్లు ఆశీష్ తెలిపాడు. మూడు రోజులకు సరిపడా ఆహారపదార్థాలను కూడా తీసుకొచ్చుకున్నట్లు చెప్పాడు. తన తండ్రికి సాయంగా తాను కూడా సైకిల్‌ను కొంత దూరం వరకు తొక్కినట్లు తెలిపాడు. తాను భవిష్యత్తులో పెద్ద అధికారి అవుతానని ఆశీష్ చెప్పుకొచ్చాడు.

  English summary
  Shobhram, a resident of Madhya Pradesh's Dhar district travelled on a bicycle with his son for around 85 kilometres to ensure he appear for his Class 10 boards supplementary exam being conducted under the state government's "Ruk Jana Nahin" scheme.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X