వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్క పురుషుడికైనా ఆ ఆపరేషన్ చేయాల్సిందే.. ఆ ఉత్తర్వులపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం..

|
Google Oneindia TeluguNews

ఏడాదిలో ఒక్క పురుషుడికైనా స్టెరిలైజేషన్(సంతానోత్పత్తి కలగకుండా చేసే ఆపరేషన్) చేయకపోతే పురుష ఆరోగ్య సిబ్బంది జీతాల్లో కోత పెడుతామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) జిల్లా అధికారులకు, ప్రధాన వైద్య, ఆరోగ్య అధికారులకు ఆ వివాదాస్పద ఉత్తర్వులను జారీ చేసింది.
అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో కమలనాథ్ సర్కార్ వెనక్కి తగ్గింది. ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.

2019-20 సంవత్సరంలో కనీసం ఒక పురుషునికైనా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించని పురుష మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్‌ను గుర్తించాలని ఎన్‌హెచ్ఎం ఉత్తర్వుల్లో పేర్కొంది. పని లేకపోతే.. వేతనం లేదన్న నిబంధనలను వారికి వర్తింపజేయాలని అందులో తెలిపింది. మధ్యప్రదేశ్‌లో కుటుంబ నియంత్రణ చేసుకునే మగవారి సంఖ్య బాగా తగ్గిపోయిందని..

madhya pradesh govt decided to withdraw circular of sterilisation

కేవలం 0.5శాతం మంది మాత్రమే స్టెరిలైజేషన్ చేయించుకుంటున్నారని పేర్కొంది. కాబట్టి ఆ సంఖ్యను పెంచేందుకు.. దానిపై పురుషులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆరోగ్య సిబ్బందికి ఉందన్నారు. కనీసం ఒక పురుషునికైనా కుటుంబ నియంత్రణ చేయించడంలో విఫలమైన ఉద్యోగులు నిర్బంధ పదవీ విరమణ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. తాజాగా ప్రభుత్వం ఆ వివాదాస్పద ఉత్తర్వులను ఉపసంహరించుకోవడంతో ఉద్యోగులు ఊరట చెందారు.

English summary
Following an uproar over its controversial order, the Madhya Pradesh government has decided to withdraw the circular sent to its male health staff to bring at least one man for sterilisation or face salary cuts and compulsory retirement. The Madhya Pradesh government has reportedly transferred the official who signed the circular.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X