పోలీస్ బాస్ రాసలీలలు: బయటపెట్టిన భార్యపై దాడి - వీడియో వైరల్ - సీఎం సీరియస్ - విదేశాల్లో విలాసాలు
రాష్ట్ర పోలీస్ శాఖలో అత్యున్నత ర్యాంకుగా పరిగణించే డీజీపీ హోదాలో ఉంటూ.. వివాహేత సంబంధం పెట్టుకోవడమే కాకుండా.. తన రాసలీలల్ని బయట పెట్టిందన్న కోపంతో కట్టుకున్న భార్యపైనే భయానకంగా దాడి చేశాడా పెద్ద మనిషి. ఐటీ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తన్న కొడుకు దీన్ని సహించలేకపోయాడు.. తండ్రి బాగోతం తాలూకు వీడియోను హోం మంత్రికి, ఇతర అధికారులకు పంపాడు.. మధ్యప్రదేశ్ లో సంచలనం రేపిన ఈ సంఘటనపై జాతీయ మహిళా కమిషన్ ప్రశ్నించడంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. సదరు అధికారిపై చర్యలకు సోమవారం ఆదేశించారు. వివరాల్లోకి వెళితే..
చైనా గుండెలో పిడుగు: ఎల్ఏసీ వద్ద సరికొత్త నిర్భయ్ మిస్సైల్‌ను మోహరించిన భారత్ - నిశబ్ధ విధ్వంసం

పేరు పురుషోత్తముడు..
మధ్యప్రదేశ్ పోలీస్ శాఖలో సీనియర్ ఐపీఎస్ అధికారి పురుషోత్తమ్ శర్మ స్పెషల్ డీజీపీ హోదాలో ప్రాసిక్యూషన్ విభాగంలో పనిచేసేవారు. సోమవారం ఉదయం నుంచి ఆయనకు సంబంధించిన ఒక వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. సొంతిట్లో భార్యను చితకబాదుతూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారాయన. పనివాళ్లు ఆపుతున్నా ఆగకుండా భార్యను నేలపై పడేపి పిడిగుద్దులు కురిపిస్తూ అచ్చం ఆకురౌడీలాగా చెలరేగిపోయాడు. ఒక దశలో ఇద్దరికీ నెత్తుటి గాయాలయ్యాయి. ఇది నాకు కత్తిగాటు పెట్టిందంటూ డీజీపీ తన చేతిని చూసుకోవడం, నిన్ను ఆపడానికే కత్తెర అడ్డం పెట్టానని భార్య అనడం వీడియోలో స్పష్టంగా వినిపించింది...
కొండను పిండిచేసిన మహిళలు - 18నెలలు తొవ్వి ఊరికి నీళ్లు - హ్యాట్పాఫ్ చెబుతోన్న దేశం

వేరే మహిళ ఇంట్లో ఉండగా..
డీజీపీ పురుషోత్తమ్ శర్మ చాలా కాలంగా వేరే మహిళలో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, ఇంట్లో భార్యను టార్చర్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆ మహిళ ఇంట్లో డీజీపీ రాసలీలల్లో మునిగి ఉండగా, అక్కడికి వెళ్లిన భార్య.. ఆ ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా దొరకబుచ్చుకుని నిలదీసింది. అప్పటికప్పుడు సర్దిచెప్పి పంపిన డీజీపీ.. కాసేపటికే ఇంటికొచ్చి భార్యపై దాడికి పాల్పడ్డాడు. కొంతకాలంగా శర్మ తీరుతో విసిగిపోయిన ఆయన కొడుకు ఈ దాడి దృశ్యాలను రికార్డు చేయించి, తన తండ్రిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా, ఇతర ఉన్నతాదికారులకు సదరు వీడియోను పంపాడు.

ఎన్డబ్ల్యూసీ ఆగ్రహం.. సీఎం ఆదేశం..
సీనియర్ ఐపీఎస్ అధికారి పురుషోత్తం శర్మ తన భార్యపై దారుణంగా దాడికి పాల్పడ్డ వీడియో సోమవారం ఉదయం నుంచి విపరీతంగా వైరలైంది. దీనిపై జాతీయ మహిళా కమిషన్(ఎన్డబ్ల్యూసీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీ ర్యాంకులో ఉండి ఇంతటి హీన చర్యకు పాల్పడటం ఖండనీయమని, ఉన్నతాధికారులే ఇలా వ్యవహరిస్తే, మహిళల భద్రత పరిస్థితి ఏంటో తెలుస్తోందని ఎన్డబ్ల్యూసీ చైర్ పర్సన్ రేఖా శర్మ అన్నారు. ఈ ఘటనపై ఎన్డబ్ల్యూసీ లేఖ రాయడంతో సదరు అధికారిని విధుల నుంచి తప్పిస్తూ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. మహిళలపై అనుచితంగా ప్రవర్తించే వాళ్లు ఎంతటి ఉన్నతాధికారులైనా సరే విడిచిపెట్టబోమని సీఎం హెచ్చరించారు. కాగా,

విదేశాల్లో విలాసాలు..
వివాహేతర సంబంధం, భార్యపై దాడి, కన్న కొడుకే వీడియో బయటపెట్టడం, సస్పెన్షన్ తదితర పరిణామాలపై ఐపీఎస్ అధికారి పురుషోత్తం శర్మ మీడియాకు భిన్నవాదన వినిపించారు. ‘‘గత 15 ఏళ్లుగా తను(భార్య) నా దగ్గర్నుంచి డబ్బులు తీసుకుని విదేశీ పర్యటనలు చేస్తోంది. ఇంతకాలం నా డబ్బుతో విలాసాలు, సుఖాలు అనుభవించిన ఆమెకు సడెన్ గా కుటుంబం పట్ల బాధ్యత, ఫ్యామిలీ ప్రతిష్ట గుర్తొచ్చాయా? దీనికి నా కొడుకు ఏమని సమాధానం చెబుతాడు?'' అని శర్మ ఎదురు ప్రశ్నించారు.