వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యప్రదేశ్‌లో చేజారిన అధికారం, జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో.. కేంద్రమంత్రి పదవీ..?

|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్‌లో అధికారం చేతులు మారింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జ్యోతిరాదిత్య సింధియా కూల్చారు. బీజేపీలో చేరిన ఆయన.. తమ వర్గం ఎమ్మెల్యేల రాజీనామా చేయించి.. కమల్ నాథ్‌ను దెబ్బకొట్టారు. ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడగా.. శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం పగ్గాలు చేపట్టారు. ఈ ఏడాదిలో జరిగిన అనూహ్య పరిణామం. అధికార మార్పిడి గురించి మినిట్ మినిట్ అప్ డేట్స్ ఈయర్ ఎండర్‌ కథనంలో మరోసారి ఆత్మవాలోకనం చేసుకుందాం. పదండి.

కూలిన ప్రభుత్వం..

కూలిన ప్రభుత్వం..

మార్చి 20వ తేదీ.. శుక్రవారం సాయంత్రం... అసెంబ్లీలో బల నిరూపణ చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. కానీ కొద్దీ గంటల ముందు ముఖ్యమంత్రి పదవీకి కమల్ నాథ్ రాజీనామా చేశారు. సభలో తమకు తగినంత బలం లేకపోవడంతో.. రిజైన్ చేయాల్సి వచ్చింది. ఆ వెంటనే గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీని ఆహ్వానించగా.. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరింది.

సింధియా కీ రోల్

సింధియా కీ రోల్

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో జ్యోతిరాదిత్య సింధియా కీ రోల్ పోషించారు. ఆయన సీఎం పదవీ ఆశించిన దక్కలేదు. పీసీసీ చీఫ్ పదవీ కూడా ఇవ్వలేదు. చివరికీ రాజ్యసభకు కూడా పంపించలేదు. దీంతో ఆయన తన వర్గంతో మంతనాలు జరిపారు. ఆరుగురు మంత్రులు సహా 22 మంది ఎమ్మెల్యేల చేత తిరుగుబాటు చేయించారు. వీరిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు శతవిధలా ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. వాస్తవానికి 15 ఏళ్ల తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో సింధియా కీలక పాత్ర పోషించారు. కానీ ఆయనను కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ నిలువరించారు. దీంతో సమయం చూసి మరీ సింధియా దెబ్బకొట్టారు.

కర్ణాటకకు తరలింపు

కర్ణాటకకు తరలింపు


మార్చి తొలివారంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో కుదుపు ప్రారంభమైంది. వెంటనే తన వర్గం ఎమ్మెల్యేలు కర్ణాటక వెళ్లగా.. వారికి షెల్టర్ అందజేశారు. ఎమ్మెల్యేలు హోటళ్లో ఉండి సుప్రీంకోర్టు తలుపుతట్టారు. అక్కడ వారికి అనుకూలంగా తీర్పు రావడం.. మెజార్టీ నిరూపించుకోవాలని కోరడంతో అధికార మార్పిడి తప్పలేదు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 230 మంది సభ్యులు ఉండగా.. కాంగ్రెస్‌కు 114 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. రెబల్ 22 ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించడంతో ఆ పార్టీ బలం 92కు పడిపోయింది. బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 104 మంది ఎమ్మెల్యేల మద్దతు సరిపోతుంది. దీంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.

22 మంది ఎమ్మెల్యేల రాజీనామా

22 మంది ఎమ్మెల్యేల రాజీనామా

జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు ఎగరవేయడంతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అనిశ్చితి నెలకొంది. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. బెంగళూరు హోటల్‌లో మకాం వేశారు. వారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హోటల్‌లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ విఫల ప్రయత్నం చేశారు. బలపరీక్ష కోసం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన వెంటనే.. స్పీకర్ ప్రజాపతి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ రెబల్ 10 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించినట్టు పేర్కొన్నారు. అంతకుముందు ఆరుగురు మంత్రుల రాజీనామాలను ఆమోదించారు. అలా 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించారు.

సింధియాకు కేంద్రమంత్రి పదవీ..?

సింధియాకు కేంద్రమంత్రి పదవీ..?

ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కూడా సింధియా వర్గం ఎమ్మెల్యేలు విజయం సాధించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కొనసాగేందుకు అవసరమైన మెజార్టీని సాధించారు. దీంతో సింధియా మరోసారి పట్టు నిలుపుకున్నారు. త్వరలో జరిగి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్రమంత్రి పదవీ వస్తుందనే ప్రచారం జరుగుతోంది. అన్నీ కున్నట్టు జరిగితే.. ఈ ఏడాదే కేంద్రమంత్రి వర్గంలో సింధియా చేరే అవకాశం ఉంది.

English summary
madhya pradesh kamalnath government toppled by jyotiraditya scindia. his followers 22 members resign to mla post
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X