వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరినైతే లైంగికంగా వేధించావో.. ఆమెతో రాఖీ కట్టించుకో... బెయిల్‌ కోసం హైకోర్టు కండిషన్...

|
Google Oneindia TeluguNews

రక్షా బంధన్ పండగ వేళ మధ్యప్రదేశ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన ఓ వ్యక్తికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ఓ షరతు విధించింది. ఎవరైతే అతని చేతిలో వేధింపులకు గురయ్యారో... ఆ బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెను రాఖీ కట్టాల్సిందిగా కోరాలని అతన్ని ఆదేశించింది. అంతేకాదు,రాఖీ కట్టినందుకు ఆమెకు,ఆమె కుమారుడికి నగదును కానుకగా ఇవ్వాలని ఆదేశించింది.

హైకోర్టు షరతులు....

హైకోర్టు షరతులు....

'బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విక్రమ్ తన భార్యను వెంట పెట్టుకుని అతనిపై ఫిర్యాదు చేసిన మహిళ ఇంటికి వెళ్లాలి. అగస్టు 3,ఉదయం 11గంటలకు రాఖీ,స్వీట్ బాక్స్ తీసుకుని ఆమె ఇంటికెళ్లాలి. ఆమెను రాఖీ కట్టాల్సిందిగా కోరాలి. జీవితకాలం ఒక అన్నలా ఆమెకు రక్షణగా నిలుస్తానని హామీ ఇస్తూ రాఖీ కట్టించుకోవాలి.' అని హైకోర్టు పేర్కొంది. సింగిల్ బెంచ్ న్యాయమూర్తి రోహిత్ ఆర్య ఈ మేరకు తీర్పునిచ్చారు.

సాక్ష్యాలు కూడా సమర్పించాలని...

సాక్ష్యాలు కూడా సమర్పించాలని...

'రాఖీ కట్టించుకోవడమే కాదు... ఆమెకు రూ.11వేలు నగదు కానుకగా ఇవ్వాలి. అలాగే ఆమె కుమారుడు కొత్త బట్టలు,స్వీట్స్ కొనుక్కునేందుకు రూ.5వేలు ఇవ్వాలి.' అని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు,దానికి సంబంధించిన సాక్ష్యాలను తిరిగి కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఇందుకోసం రాఖీ కట్టించుకున్న సమయంలో,ఆమెకు కానుక అందించే సమయంలో ఫోటోలు తీసుకుని... అవి కోర్టుకు సమర్పించాలని చెప్పింది.

న్యాయవాదులు ఏమంటున్నారు...

న్యాయవాదులు ఏమంటున్నారు...

'విక్రమ్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసిన ఆ మహిళ ఉజ్జయిని జిల్లా వాసి. ఏప్రిల్ 20న అతను తన ఇంట్లోకి చొరబడి లైంగిక వేధింపులకు గురిచేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.' అని ప్రభుత్వ న్యాయవాది సుధాన్షు వ్యాస్ తెలిపారు. దీనిపై భట్‌పచలన పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 354,452,323,506ల కింద కేసులు నమోదైనట్లు చెప్పారు. నిందితుడి తరుపు న్యాయవాది మాట్లాడుతూ... విక్రమ్ కుటుంబమంతా అతనొక్కడి ఆదాయం పైనే ఆధారపడి ఉందన్నారు. అతని అరెస్టు తర్వాత ఆ కుటుంబమంతా ఆకలితో అలమటిస్తోందని... కాబట్టి అతనికి బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరినట్లు తెలిపారు.

సొంత పూచీకత్తుపై బెయిల్...

సొంత పూచీకత్తుపై బెయిల్...

హైకోర్టు షరతులకు అతను ఒప్పుకోవడంతో రూ.50వేలు పూచీకత్తుపై అతనికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అలాగే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో నేపథ్యంలో ఆరోగ్య సేతు యాప్‌ను సెల్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలని నిందితుడు విక్రమ్‌కు సూచించింది.

English summary
The Indore bench of the Madhya Pradesh high court has granted bail to a man accused of sexual harassment on condition that he would visit the complainant with a box of sweets, request her to tie a Rakhi on his wrist, promise to protect her and gift her Rs 11,000 as part of the customs observed on Raksha Bandhan day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X