వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేడీ కానిస్టేబుల్‌పై స్టేషన్‌లోనే రేప్.. నిందితుడు సహచర పోలీసే.. న్యూడ్ వీడియోలతో బెదిరించి ఘాతుకం

|
Google Oneindia TeluguNews

కలిసి పనిచేస్తున్నాడనే చనువుకొద్దీ ఇంట్లోకి ఇంట్లోకి రానిస్తే.. చివరికి ఆమె జీవితంతోనే ఆడుకోవాలని చూశాడో ఖాకీచకుడు. సహచర లేడీ కానిస్టేబుల్ న్యూడ్ వీడియోలను రహస్యంగా చిత్రీకరించి.. మాటవినకుంటే వాటిని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించి.. పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధలు భరించలేని స్థితిలో ఆమె తెగించి కీచకుడిపై కేసు పెట్టింది. సంచలనం రేపిన ఈ సంఘటన మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధాని ఇండోర్‌లో చోటుచేసుకుంది.

పోలీసులు ఏం చెప్పారంటే..

పోలీసులు ఏం చెప్పారంటే..

ఇండోర్ సిటీలోని ఎంజీ రోడ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో రాజేంద్ర చతుర్వేది మీడియాకు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి... ఎంజే రోడ్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తోన్న మనీశ్ శర్మ.. అదే స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తోన్న మహిళపై కొన్ని నెలలుగా లైంగికదాడికి పాల్పడుతూవచ్చాడు. బాధిత మహిళలను రహస్యంగా వీడియోలు తీసి, వాటితో బ్లాక్ మెయిల్ చేసి అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలిందని చతుర్వేది తెలిపారు.

ఎక్కడపడితే అక్కడ..

ఎక్కడపడితే అక్కడ..

వీడియోలను అడ్డంపెట్టుకుని కానిస్టేబుల్ మనీశ్ శర్మ నరకం చూపించేవాడని, డీఆర్‌పీ లైన్‌లోని ఇంటికి పదేపదే వచ్చేవాడని, ఇల్లు, పోలీస్ స్టేషన్ అనే తేడాలేకుండా ఎక్కడపడితే అక్కడే లైంగికదాడికి ప్రయత్నించేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు మొదట బన్‌గంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, తర్వాత కేసును ఆమె పనిచేస్తోన్న ఎంజీ రోడ్ పోలీస్ స్టేషన్ కే బదిలీచేశారు.

కటకటాల్లో కీచకుడు

కటకటాల్లో కీచకుడు

తోటి ఉద్యోగిపై అఘాయిత్యానికి పాల్పడిన కానిస్టేబుల్ ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదుచేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మనీశ్ శర్మను జ్యూడీషియల్ రిమాండ్ కు తరలించామని ఎస్ హెచ్ వో రాజేంద్ర చతుర్వేది చెప్పారు. మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ సైతం ఈ ఘటనపై ఉన్నతాధికారులను ఆరాతీశారు. నిందితుడికి కఠిన శిక్షలు పడేలా చేయాలని సూచించారు.

English summary
In Madhya Pradesh's Indore a woman constable was allegedly raped by a male constable several times. The accused constable used to threaten the survivor on the pretext of making an objectionable video of her and uploading it online.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X