వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: ఒరేయ్.... నువ్వు ముస్లీం కదా ?, గడ్డం లాయర్ కు వాతలు, లేపేస్తాం అని ఇంట్లో వార్నింగ్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశం మొత్తం మార్చి 25వ తేదీ నుంచి లాక్ డౌన్ అమలు చేశారు. అయితే లాక్ డౌన్ కు ముందే ఆసుపత్రిలో చికిత్స కోసం వెలుతున్న లాయర్ మీద ఓ పోలీసు అధికారి తన ప్రతాపం చూపించాడు. లాయర్ గడ్డం పెట్టుకోవడంతో అతను ముస్లీం అనుకుని అతను ఆసుపత్రికి వెళ్లకుండా అడ్డుకుని చితకబాదేశాడు. చివరికి ఆ లాయర్ పై అధికారులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చెయ్యాలని పట్టుబట్టాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ పోలీసు అధికారి నేరుగా లాయర్ ఇంటికి వెళ్లి కేసు వెనక్కి తీసుకోవాలని, లేదంటే లేపేస్తానని బెదిరించాడు. పోలీసు అధికారి వ్యవహారం మొత్తం సాక్షాలతో సహ మీడియా చేతికి చిక్కడంతో అసలు కథ మొదలైయ్యింది.

Lockdown: ప్రభుత్వ ఆఫీస్ లో బ్లాక్ కలర్ బాబాయ్, పింక్ శ్యారీ అంటీ ఏం చేశారంటే ?, వీడియో వైరల్ !Lockdown: ప్రభుత్వ ఆఫీస్ లో బ్లాక్ కలర్ బాబాయ్, పింక్ శ్యారీ అంటీ ఏం చేశారంటే ?, వీడియో వైరల్ !

 గడ్డం పెట్టుకున్న లాయర్

గడ్డం పెట్టుకున్న లాయర్

కరోనా వైరస్ మహమ్మారి విషయంలో ఓ వర్గం వారి మీద కొందరు ప్రజలు గుర్రుమని ఉన్నారు. మధ్యప్రదేశ్ లోని బేతుల్ జిల్లాలో దీపక్ బుండేల్ ఆనే వ్యక్తి లాయర్ గా పని చేస్తున్నాడు. న్యాయవాది దీపక్ కొంతకాలంగా గడ్డం పెంచుతున్నాడు. మార్చి 23వ తేదీన దీపక్ బేతుల్ జిల్లా ఆసుపత్రికి చికిత్స కోసం బయలుదేరాడు.

ఒరేయ్.... నువ్వు ముస్లీం కదా ?

ఒరేయ్.... నువ్వు ముస్లీం కదా ?

బేతుల్ జిల్లాలో బీఎస్. పటేల్ సబ్ ఇన్స్ పెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. బేతుల్ జిల్లా ఆసుపత్రికి వెలుతున్న లాయర్ దీపక్ ను ఎస్ఐ బీఎస్. పటేల్ అడ్డుకున్నాడు. నువ్వు ఎక్కడికి వెలుతున్నావ్ ? అని లాయర్ దీపక్ ను ఎస్ఐ బీఎస్. పటేల్ ప్రశ్నించాడు. తాను జిల్లా ఆసుపత్రికి చికిత్స కోసం వెలుతున్నానని దీపక్ సమాధానం ఇచ్చాడు. ఒరేయ్.....నువ్వు ముస్లీం కదా, అందుకేరా నువ్వు గడ్డం పెంచుకున్నావ్, ఆసుపత్రిలో నీకు ఏం పని, మర్యాదగా ఇంటికి వెళ్లిపో అంటూ ఎస్ఐ బీఎస్, పటేల్ లాయర్ దీపక్ కు వార్నింగ్ ఇచ్చాడు.

 లాయర్ అని చెప్పినా చితకబాదేశాడు

లాయర్ అని చెప్పినా చితకబాదేశాడు

తాను ముస్లీం కాదని, తన పేరు దీపక్ అని, తాను న్యాయవాదిగా పని చేస్తున్నానని అతను సమాధానం ఇచ్చాడు. నాకే ఎదురు చెబుతావా ? అంటూ ఎస్ఐ బీఎస్. పటేల్ లాఠీ తీసుకుని దీపక్ ను చితకబాదేశాడు. దీపక్ ను ఇష్టం వచ్చినట్లు కొడుతున్న ఎస్ఐ బీఎస్. పటేల్ కు సాటి పోలీసులు నచ్చచెప్పి అతన్ని విడిపించారు. తరువాత లాయర్ దీపక్ కష్టపడి బేతుల్ జిల్లా ఆసుపత్రికి చేరుకుని చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లాడు.

 సీసీటీవీ క్లిప్పింగ్స్ ఇస్తే ?

సీసీటీవీ క్లిప్పింగ్స్ ఇస్తే ?

తన మీద అనవసరంగా దాడి చేసిన ఎస్ఐ బీఎస్. పటేల్ మీద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాలని లాయర్ దీపక్ పై పోలీసు అధికారులకు మనవి చేశాడు. తన మీద దాడి చేస్తున్న ప్రాంతంలో ఉన్న సీసీటీవీ పుటేజ్ లు సేకరించిన లాయర్ దీపక్ పై పోలీసు అధికారులకు ఇచ్చాడు. అయితే లాయర్ దీపక్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ బీఎస్. పటేల్ మీద కేసు నమోదు చెయ్యడానికి పోలీసు అధికారులు పెద్దగా ఆసక్తి చూపించలేదని లాయర్ దీపక్ ఆరోపించాడు.

 ఇంటికి వెళ్లి లేపేస్తానని వార్నింగ్

ఇంటికి వెళ్లి లేపేస్తానని వార్నింగ్

తన మీద పైఅధికారులకు లాయర్ దీపక్ ఫిర్యాదు చేశాడని తెలుసుకున్న ఎస్ఐ బీఎస్. పటేల్ నేరుగా అతని ఇంటికి వెళ్లాడు. మీరు గడ్డం పెట్టుకోవడం వలన పోరపాటున ముస్లీం అని భావించి కొట్టానని, ఈ విషయం ఇంతటితో వదిలేయాలని, కేసు వెనక్కి తీసుకోవాలని ఎస్ఐ. పటేల్ లాయర్ దీపక్ మీద ఒత్తిడి చేశాడు. కేసు వెనక్కి తీసుకోకపోతే నీ అంతు చూస్తానని, నిన్ను లేపేస్తానని ఎస్ఐ. పటేల్ లాయర్ దీపక్ ను హెచ్చరించాడు. ఎస్ఐ బీఎస్. పటేల్ ఇంట్లో తనకు వార్నింగ్ ఇస్తున్న సమయంలో లాయర్ దీపక్ మొత్తం వ్యవహారం మొబైల్ లో రికార్డు చేశాడు.

Recommended Video

Trump To Bring Back Drug Making To US From India And China
ఎస్ఐ దూల తీరిపోయింది... ఉద్యోగం !

ఎస్ఐ దూల తీరిపోయింది... ఉద్యోగం !

ఇంటికి వచ్చి ఎస్ఐ బీఎస్. పటేల్ తనకు ఎలా వార్నింగ్ ఇచ్చాడో మీరే చూడండి అంటూ లాయర్ దీపక్ ఆ వీడియోలను మీడియాకు విడుదల చేశాడు. ఈ వ్యవహారం ముదిరిపెద్దది కావడంతో బేతుల్ జిల్లా ఎస్పీ డీఎస్. భడోరియా ఎస్ఐ బీఎస్. పటేల్ ను సస్పెండ్ చేశారు. ఎస్ఐ బీఎస్. పటేల్ ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించామని బేతుల్ జిల్లా అదనపు పోలీసు కమిషనర్ శ్రద్దా జోషి దృవీకరించారు. మొత్తం మీద గడ్డం పెంచుకున్న పాపానికి ఓ లాయర్ పోలీసుల చేతిలో తన్నులు తిన్నాడని తెలుసుకున్న సాటి న్యాయవాదులు ఎస్ఐ బీఎస్. పటేల్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

English summary
Lockdown: A police officer in Madhya Pradesh's Betul district was suspended on Wednesday after he allegedly told a lawyer, a victim of police thrashing, that he had been mistaken for a Muslim.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X