వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుప్పకూలిన లిఫ్ట్: అందులో మాజీ ముఖ్యమంత్రి: ఆసుపత్రిలో: హనుమంతుడి దయ అంటూ

|
Google Oneindia TeluguNews

భోపాల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు తృటిలో పెను ముప్పు తప్పింది. ఆయన ఎక్కిన లిఫ్ట్ కుప్పకూలింది. ఆ ఘటనలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కమల్‌నాథ్‌తో పాటు మధ్యప్రదేశ్‌కే చెందిన మరో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఈ ఘటన నుంచి సురక్షితంగా తప్పించుకోగలిగారు. హనుమంతుడి దయ వల్ల ఈ ఘటనలో సురక్షితంగా బయట పడ్డానని కమల్‌నాథ్ ట్వీట్ చేశారు.

పతనం అంచుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం: ముఖ్యమంత్రి రాజీనామా?: బీజేపీ మార్క్ పతనం అంచుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం: ముఖ్యమంత్రి రాజీనామా?: బీజేపీ మార్క్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామేశ్వర్ పటేల్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇండోర్‌లోని డీఎన్ఎస్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించడానికి కమల్‌నాథ్ సహా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జీతూ పట్వారి, సజ్జన్ వర్మ, విశాల్ పటేల్.. ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రి మూడో అంతస్తులోని వీఐపీ వార్డులో చికిత్స పొందుతోన్న రామేశ్వర్ శర్మను వారు పరామర్శించారు. అనంతరం కిందికి రావడానికి లిఫ్ట్ ఎక్కారు.

 Madhya Pradesh: Narrow Escape For former CM Kamal Nath As Lift Crashes

వారు లిఫ్ట్ ఎక్కిన వెంటనే పెద్ద శబ్దం చేస్తూ లిఫ్ట్ కుప్పకూలింది. 10 అడుగుల ఎత్తు మీది నుంచి ఒక్కసారిగా బేస్‌మెంట్ మీదికి పడిపోయింది. ఆ వెంటన లిఫ్ట్ డోర్ తెరచుకోలేదు. సుమారు 15 నిమిషాల పాటు కమల్‌నాథ్ సహా కాంగ్రెస్ నేతలంతా అందులోనే చిక్కుకుపోయారు. సాంకేతిక సిబ్బందిని పిలిపించి, లిఫ్ట్‌ డోర్‌ను తెరిచారు. లిఫ్ట్‌లో ఉన్న వారెవరికీ ఎలాంటి గాయాలు తగ్గలేదని, వారంతా సురక్షితంగా ఉన్నారని రామేశ్వర్ పటేల్ కుమారు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ శర్మ తెలిపారు.

ఓవర్ లోడ్ వల్ల లిఫ్ట్ కుప్పకూలిపోయి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్.. కమల్‌నాథ్‌కు ఫోన్ చేశారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. లిఫ్ట్ కుప్పకూలిన ఘటనపై విచారణ చేపట్టాలని ఇండోర్ కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. ఈ సమాచారం అందిన వెంటనే స్థానిక కాంగ్రెస్ నాయకులు డీఎన్ఎస్ ఆసుపత్రి వద్ద ధర్నా చేశారు.

English summary
Former Chief Minister of Madhya Pradesh Kamal Nath was visiting Congress leader Rameshwar Patel at the DNS Hospital in Indore and was inside the lift with other party leaders when it fell from the first floor to the ground.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X