వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బైపోల్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, ఒడిశాలో బిజెడి గెలుపు

By Narsimha
|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రెండు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఒడిశా రాష్ట్రంలో బిజెడి గెలుపు సాధించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కొలారస్, ముంగావళి అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంది. ఒడిశాలోని బిజేపూర్‌లో మాత్రం కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. ఆ సీటును బీజేడీకి కోల్పోయింది.

మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ రెండు రాష్ట్రాల్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే ఎన్నికల్లో ఓటర్ల నాడిని తెలిపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మంగోలి, కొలారస్ అసెంబ్లీ స్థానాలు, ఒడిశా రాష్ట్రంలోని బిజెపూర్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఫిబ్రవరి 24వ, తేదిన ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు బుదవారం నాడు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.

Madhya Pradesh, Odisha Bye-Elections Counting Begins

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రెండు అసెంబ్లీ స్థానాలకు రికార్డు స్థాయిలో 70 నుండి 77 శాతం పోలింగ్ నమోదైంది. గుణ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మంగోలి, కోలారస్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మంగోలి కాంగ్రెస్ ఎమ్మెల్యే మహేంద్రసింగ్, కోలారస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్ సింగ్ మరణించడంతో ఉప ఎన్నికలు నిర్వహించారు.

ఒడిశాలోని బిజెపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుభాల్ సాహూ మరణంతో నిర్వహించారు.ఈ మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

English summary
The results of bye-elections to Mungaoli and Kolaras Assembly seats in Madhya Pradesh and Bijepur seat in Odisha will be declared today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X