వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: రైల్వేస్టేషన్ పక్కనే భారీ పేలుడు: వణికిన ప్రయాణికులు: తెగిపడ్డ కరెంటు తీగలు

|
Google Oneindia TeluguNews

జబల్‌పూర్: రైల్వేస్టేషన్‌కు సమీపంలో చోటు చేసుకున్న ఓ పేలుడు ప్రయాణికులను వణికించింది. తలో దిక్కునకు పారిపోయేలా చేసింది. చెవులు చిల్లులు పడేలా, భారీ శబ్దం చేస్తూ పేలుడు సంభవించడంతో అధికారులు ఉలిక్కి పడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభభవించ లేదు. రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లింది. ఓవర్ హెడ్‌లైన్స్ విద్యుత్ తీగలు ధ్వంసం అయ్యాయి. ఫలితంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ సమీపంలో గల దుండి రైల్వేస్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్‌కు అత్యంత సమీపంలో భారీ పేలుడు సంభవించింది. దుండి రైల్వే స్టేషన్ సమీపంలో క్వారీ కోసం అమర్చిన డిటోనేటర్లు ఈ పేలుడుకు కారణమైనట్లు అధికారులు గుర్తించారు. పేలుడు సంభవించిన సమయంలో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌లో ఓ ఎక్స్‌ప్రెస్ రైలు కనిపించింది.

భారీ శబ్దం వినిపించిన వెంటనే ప్రయాణికులు వణికిపోయారు. పేలుడు సంభవించిన వెంటనే దుమ్ము, ధూళి, రాళ్లు గాల్లోకి ఎగిరాయి. సుమారు 30 అడుగుల ఎత్తు వరకు గాల్లోకి ఎగిరి పడ్డాయి. రైల్వేస్టేషన్ మొత్తం దుమ్ము, ధూళితో నిండిపోయింది. రాళ్లు పడటంతో రైల్వేస్టేషన్ ప్రహరీగోడ దెబ్బతిన్నది. ఓవర్ హెడ్‌లైన్స్ తీగలు ధ్వంసం అయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా రైళ్ల రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Madhya Pradesh: Overhead line damages during blasting work at Dundi Railway Station

Recommended Video

Andhra Pradesh Retains Top Rank For Ease Of Doing Business || Oneindia Telugu

సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇకముందు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలను తీసుకుంటామని అన్నారు. ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని పశ్చిమ మధ్య రైల్వే ముఖ్య పౌర సంబంధాల అధికారిణి ప్రియాంక దీక్షిత్ తెలిపారు. ఓవర్ హెడ్ లైన్స్ దెబ్బతిన్నాయని అన్నారు.

English summary
The accident appeared to have taken place allegedly while blast carried out at Dundi Railway Station in Madhya Pradesh’s Jabalpur on September 05. The video went viral on social media. No injuries have been reported yet. Speaking on this incident Chief Public Relation Officer (CPRO) of West Central Railway Priyanka Dikshit said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X