వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లికి బంధువులెందుకోయ్..!తాళి, వధువుంటే చాలదా..?వరుడిపై మద్యప్రదేశ్ పోలీసుల కేసు నమోదు..!

|
Google Oneindia TeluguNews

భోపాల్/హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి జనాల చేత చిత్ర విచిత్ర వేశాలేపిస్తోంది. మొహానికి మాస్క్ తప్పనిసరి చేసింది, చేతికి గ్లౌజులు వేయించింది, ఇళ్లకే పరిమితం చేసింది, తాజాగా పెళ్లిళ్లను కూడా ఒంటరిగానే చేసుకోమంటోంది మాయలమారి కరోనా. కాదంటే తీవ్ర పరిణామాలు ఎదురౌతాయని హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది కరోనా. మద్యప్రదేశ్ లో అచ్చం ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. శుభమా అంటూ నలుగురి సమక్షంలో పెళ్లి చేసుకోవాలని భావించిన పెళ్లికొడుకు పట్ల కొరడా ఝుళిపించింది కరోనా.

దేశంలో కరోనా ప్రమాద ఘంటికలు..! జూన్ 30వరకూ లాక్‌డౌన్‌ పొడిగించిన ఆ రాష్ట్రం..!దేశంలో కరోనా ప్రమాద ఘంటికలు..! జూన్ 30వరకూ లాక్‌డౌన్‌ పొడిగించిన ఆ రాష్ట్రం..!

పెళ్లికి పోటెత్తిన బంధుమిత్రులు.. ఎక్కువ మందిని ఆహ్వానించిన పెళ్లికొడుకుపై కేసు నమోదు..

పెళ్లికి పోటెత్తిన బంధుమిత్రులు.. ఎక్కువ మందిని ఆహ్వానించిన పెళ్లికొడుకుపై కేసు నమోదు..

కరోనా వైరస్ నిబంధనలు ఓ పెళ్లి కొడుకుని కష్టాలపాలు చేశాయి. బంధుమిత్రుల సమక్షంలో అట్టహాసంగా పెళ్లి చేసుకుందామనుకున్న ఆ యువకుడికి పోలీసులు చుక్కలు చూపించారు. కరోనా నిబంధనలకు విరుద్దంగా పెళ్లి చేసుకున్నాడని ఏకంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్‌ జిల్లాలో పెళ్లి చేసుకుందామనుకున్న అతడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. పెళ్లి సందర్బంగా ఆంక్షలను ఉల్లంఘించి తగిన మూల్యం చెల్లించుకున్నాడు.

పెటాకులైన పెళ్లి.. కొరడా ఝుళిపిస్తున్న లాక్‌డౌన్ ఆంక్షలు

పెటాకులైన పెళ్లి.. కొరడా ఝుళిపిస్తున్న లాక్‌డౌన్ ఆంక్షలు

లాక్‌డౌన్ ఆంక్షల నేపధ్యంలో వివాహనికి ఎక్కువ మంది పిలవకూడదన్న నిబందనలు ఉన్నప్పటికి వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరించాడు ఆ ప్రభుత్వ ఉద్యోగి అయిన నూతన వరుడు. మద్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇరవై నాలుగేళ్ల వరుడు కను చౌహాన్‌, బేతుల్‌ జిల్లాలో పట్వారీ గ్రామ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి పెళ్లి కుదరడంతో బందుమిత్రుల సమక్షంలో అట్టహాసంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంతే అనుకున్నదే తడువుగా అలీరాజ్‌పూర్‌లో పెళ్లికి గ్రాండ్ గా ఏర్పాట్లు చేసుకున్నాడు కను చౌహాన్.

పెళ్లికి హాజరైన వెయ్యిమంది.. నిబంధనలకు విరుద్దమన్న పోలీసులు..

పెళ్లికి హాజరైన వెయ్యిమంది.. నిబంధనలకు విరుద్దమన్న పోలీసులు..

తన పెళ్లికి రావాలంటూ వాట్సాప్‌, సోషల్‌ మీడియాలో ఆహ్వాన పత్రికను రెచ్చిపోయి షేర్‌ చేశాడు కను చౌహాన్. దీంతో దాదాపు వెయ్యి మందికి పైగా పరిచయస్తులు, బంధుమిత్రులు పెళ్లికి హాజరయ్యారు. ప్రభుత్వం సూచించిన నిబంధలు ఏమాత్రం పాటించకుండా, కనీసం మాస్కులు కూడా ధరించకుండా వివాహ వేడుకలో పాలుపంచుకున్నారు. పెళ్లికి వచ్చిన ఓ ఔత్సాహిక వ్యక్తి ఒకరు ఆ కార్యక్రమాన్ని మొత్తం మొబైల్ ఫోన్ లో చిత్రీకరించి ఆ వీడియోను సోషల్‌ మీడియాకి అంకితం చేసాడు.

Recommended Video

YSR Rythu Bharosa : Another Good News For AP Farmers,Govt Will Dig Borewells For Farming
వరుడిపై కేసు నమోదు.. కళ తప్పిన కళ్యాణ మంటపం..

వరుడిపై కేసు నమోదు.. కళ తప్పిన కళ్యాణ మంటపం..

వీడియో కళ్లారా చూసి విషయం తెలుసుకున్న పోలీసులు వెను వెంటనే సదరు పెళ్లి కొడుకు కనుపై సెక్షన్‌ 188 కింద కేసు నమోదు చేశారు. అప్పటి వరకు అంగరంగ వైభవంగా, కోలాహలంగా జరుగుతున్న వివాహ సంబరాలు పోలీసులు ప్రత్యక్షం అయ్యే సరికి ఆవిరయ్యాయి. దీంతో కళకళలాడల్సిన కళ్యాణ మండపం ఒక్కసారిగా కళ తప్పినట్టు తయారయ్యింది. పెద్ద యెత్తున పెళ్లికి ఆహ్వానించిన బంధుమిత్రుల స్మార్ట్ ఫోన్లు అనుమతించబడదు అని శరతులు విధిస్తే పెళ్లి తంతు సుఖాంతమయ్యేదనే చర్చ జరుగుతోంది.

English summary
Attend the wedding ceremony without following any of the rules prescribed by the government and even wearing masks.One of the bridesmaids posted a video on social media that showed the entire event on a mobile phone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X