వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యప్రదేశ్ నిర్ణయం: రేప్ చేస్తే మరణ శిక్షనే...

అత్యాచారాలను అరికట్టేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరుగుతుండడంతోప్రభుత్వం కఠిన నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలో మహిళలకు కనీస భద్రత కరువ

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

రేప్ చేస్తే మరణ శిక్ష : వెంటపడి వేధించినా రూ.లక్ష జరిమానా ! | Oneindia Telugu

భోపాల్‌: అత్యాచారాలను అరికట్టేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరుగుతుండడంతోప్రభుత్వం కఠిన నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలో మహిళలకు కనీస భద్రత కరువైందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

దాంతోప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే దోషులకు మరణ శిక్ష విధించాలన్న తీర్మానానికి ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మహిళలపై సామూహిక అత్యాచారం చేసే నిందితులకు కూడా మరణ శిక్ష విధించేందుకు పచ్చజెండా ఊపింది.

అత్యాచారం రుజువైన పక్షంలో నిందితులకు విధించే శిక్ష, జరిమానా మొత్తాన్ని పెంచేందుకు సైతం శిక్షా స్మృతిని సవరించేందుకు కూడా అంగీకారం తెలిపింది.మహిళలపై అత్యాచారయత్నం చేసినా, వెంటపడి వేధించినా రూ.లక్ష జరిమానా విధించాలని నిర్ణయించింది.

Death penlty

ఇందుకు సంబంధించి ఈ శీతాకాల సమావేశాల్లో శాసనసభలో బిల్లు ప్రతిపాదిస్తామని ఆర్థిక మంత్రి జయంత్‌ తెలిపారు. రాష్ట్రంలో బాలికలపై అఘాయిత్యాలను నియంత్రించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఎన్‌సీఆర్‌బీ రికార్డుల ప్రకారం దేశంలో అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది.

English summary
The cabinet of Shivraj Singh Chouhan in Madhya Pradesh has decided to push for capital punishment for rapists who target children aged 12 years and less. Death penalty will also be awarded to convicts of gang rape cases, said the state's Finance Minister Jayant Malaiya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X