వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింధ్ బ్రిడ్జ్ తొక్కిసలాటపై రాజకీయం: విషాదం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దాతియా వద్ద గల రతన్ గఢ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 115కు చేరుకుంది. ఈ తొక్కిసలాట ఘటన రాజకీయ రంగు పులుముకుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెసు పార్టీ డిమాండ్ చేస్తోంది.

త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఘటన జరిగిన బ్రిడ్జిపై నుండి వాహనం వెళ్లేందుకు పోలీసులు లంచం తీసుకున్నారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. బ్రిడ్జి పై నుండి ఒక్కో ట్రాక్టరును పంపించేందుకు పోలీసులు రూ.200 తీసుకున్నారని, ఇది నో ట్రాఫిక్ జోన్ అని, ఇది మధ్య ప్రదేశ్ ప్రభుత్వ మంచి పాలన అని ట్వీట్ చేశారు.

ఈ దుర్ఘటనకు పోలీసులు, అధికారులే కారణమనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు కాంగ్రెసు పార్టీ రాజకీయ రంగు పులమడాన్ని భారతీయ జనతా పార్టీ తప్పు పట్టింది. మరోవైపు మృతుల సంఖ్యను తగ్గించేందుకు పోలీసులు మృతదేహాలను సింధ్ నదిలో పడవేశారనే ఆరోపణలను పోలీసు అధికారులు కొట్టి పారేశారు.

తొక్కిసలాట తర్వాత సింధ్ నది బ్రిడ్జి

తొక్కిసలాట తర్వాత సింధ్ నది బ్రిడ్జి

దసరా పర్వదినం సందర్భంగా రతన్ గఢ్ ఆలయంలో ఆదివారం జరిగిన తొక్కిసలాట అనంతరం సింధ్ నది బ్రిడ్జి ఇలా హృదయవిదారకంగా మారిన దృశ్యం.

తొక్కిసలాట

తొక్కిసలాట

ఆదివారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దతియా జిల్లాలోని రతన్ గఢ్ ఆలయం వద్ద సింధ్ రివర్ బ్రిడ్జి పైన తొక్కిసలాట అనంతరం దృశ్యం.

 సింధ్ రివర్ పైన ప్రజలు

సింధ్ రివర్ పైన ప్రజలు

ఆదివారం సింధ్ నది బ్రిడ్జి పైన తొక్కిసలాట జరిగిన అనంతరం ప్రజలు అక్కడి నుండి వెళ్తున్న దృశ్యం. తొక్కిసలాటలో దాదాపు 115 మంది మృతి చెందారు.

హృదయ విదారకం

హృదయ విదారకం

దసరా పర్వదినం సందర్భంగా రతన్ గఢ్ ఆలయంలో ఆదివారం జరిగిన తొక్కిసలాట అనంతరం సింధ్ నది బ్రిడ్జి ఇలా హృదయవిదారకంగా మారిన దృశ్యం.

బ్రిడ్జి పైన భక్తులు

బ్రిడ్జి పైన భక్తులు

మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలోని రతన్ గఢ్ ఆలయంకు సింధ్ బ్రిడ్జి మీదుగా పెద్ద సంఖ్యలో వెళ్తున్న భక్తులు. ఈ బ్రిడ్జి పైన తొక్కిసలాట జరిగింది.

తొక్కిసలాట తర్వాత

తొక్కిసలాట తర్వాత

దసరా పర్వదినం సందర్భంగా రతన్ గఢ్ ఆలయంలో ఆదివారం జరిగిన తొక్కిసలాట అనంతరం సింధ్ నది బ్రిడ్జి ఇలా హృదయవిదారకంగా మారిన దృశ్యం.

English summary
As the death toll in the stampede near a famous Madhya Pradesh temple rose to 115, Congress has demanded that the BJP's Shivraj Singh Chouhan step down as Chief Minister of the election-bound state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X