వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలోనే తొలిరాష్ట్ర: గోవధ వ్యతిరేక చట్టంను సవరించనున్న మధ్యప్రదేశ్

|
Google Oneindia TeluguNews

భోపాల్ : దేశంలో గోవులను చంపేస్తున్నారన్న అనుమానంతో చాలామందిపై గోసంరక్షకులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో కొందరు మృతి కూడా చెందారు. ఇక గోసంరక్షణ చట్టంను తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ అడుగు ముందుకేయనుంది. గోవధ వ్యతిరేక చట్టంను సవరించాలని కమల్‌నాథ్ సర్కార్ భావిస్తోంది. హింస, చట్ట ఉల్లంఘనకు పాల్పడిన వారిపై, ఆస్తుల ధ్వంసం చేసిన వారిపై ఎలాంటి శిక్ష అమలు చేయాలనేదానిపై చట్టసవరణ చేయనున్నారు. ఇలా చేస్తే దేశంలోనే గోసంరక్షణ చట్టం అమలు చేసే రాష్ట్రాల్లో తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ అవతరించనుంది.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రవర్తించిన వారికి మూడేళ్లు వరకు జైలు శిక్ష ఉండేలా చట్టాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక తర్వాత కూడా ఇలాంటి చర్యలకు దిగితే ఐదేళ్లు జైలుశిక్ష విధించనున్నట్లు కమల్‌నాథ్ సర్కార్ చట్టాన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేబినెట్‌లో చర్చించడం జరిగిందని కేబినెట్ ఇందుకు ఆమోదం తెలిపితే అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లును పాస్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం గోవధకు సంబంధిచిన నేరాలు ఐపీసీ, సీఆర్‌పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదవుతున్నాయి.

Madhya Pradesh to bring in Law against cow vigilantism,likely to become first state

సామూహిక దాడులతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని సుప్రీంకోర్టు గతేడాది జూలైలో తీర్పు వెల్లడించింది. మాబ్ లించింగ్‌కు సంబంధించి కొన్ని సూచనలు చేసింది. అదేసమయంలో గోవధ పేరుతో వ్యక్తులపై కొందరు దాడి చేయడం సరైన పద్ధతి కాదని చెప్పిన సుప్రీంకోర్టు... ఇలాంటి ఘటనలు అరికట్టేందకు కేంద్రం కొత్తగా చట్టం తీసుకురావాలని అభిప్రాయపడింది.ఇటువంటి నేరాలను ఎదుర్కోవటానికి "నివారణ, పరిష్కార మరియు శిక్షాత్మక చర్యలు" అందించాలని సుప్రీం కోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.

English summary
Congress-ruled Madhya Pradesh is likely to become the first state in the country to legislate against cow vigilantism. The government proposes to amend the anti-cow slaughter Act to make those indulging in violence or those caught for violating the law or damaging property a punishable offence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X