• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొండను పిండిచేసిన మహిళలు - 18నెలలు తొవ్వి ఊరికి నీళ్లు - హ్యాట్పాఫ్ చెబుతోన్న దేశం

|

అభివృద్ధికి దూరంగా ఉండే బుందేల్ ఖండ్ ప్రాంతంలో.. చుట్టూ కొండలతో విసిరేసినట్లుగా ఉంటుందా ఊరు. ఎన్నికల సమయంలో తప్ప ఘనత వహించిన నేతలెవరూ అటుగా వెళ్లరు. ఉన్నది ప్రకృతి ఒడిలోనే అయినా.. సరైన స్టోరేజీ సౌకర్యంలేక ఆ ఊరు నీటి కొరతను ఎదుర్కొంది. మనుషులు, పశువులు తాగడానికి, వ్యవసాయానికి సరిపడా నీళ్లు లేక జనం ఇబ్బందులు పడేవాళ్లు. ఊరికి నీళ్ల బాధను దూరం చేసే బాధ్యతను మహిళలు స్వచ్ఛందంగా భుజానికెత్తుకున్నారు..

ఎన్డీఏ నుంచి మరో పార్టీ ఔట్? - బీజేపీ ద్రోహం చేసిందన్న ఎన్‌పీపీ - మణిపూర్‌లో మళ్లీ హైడ్రామా

కొండను తొలిచి కాలువ..

కొండను తొలిచి కాలువ..

అది ప్రపంచ ప్రఖ్యాత ఖజురహో ఆలయాలకు నెలవైన ఛత్తర్ పూర్ జిల్లా. ఉత్తప్రదేశ్ తో సరిహద్దును పంచుకునే ఈ మధ్యప్రదేశ్ జిల్లాలో మారుమూర గ్రామం అంగ్రోత. దాదాపు రెండొందల కుటుంబాలుండే కుటుంబాలుండే ఆ ఊరికి నీటి తిప్పలు తీర్చేందుకు మహిళలే నడుం బిగించారు. ‘జల్ సహేలీ' పేరుతో బృందంగా ఏర్పడి.. ఊరి చెరువు పూర్తిగా నిండానికి అడ్డుగా ఉన్న కొండను పిండి చేశారు. క్రమంగా కొండను తొలిచి, అడవిలో పారే నీళ్లు ఊరి చెరువుకు వచ్చేలా చేశారు.

కాంగ్రెస్, కంగనకు భారీ షాక్ - బీజేపీ, శివసేన రహస్య భేటీ - అమిత్ షా చెంతకు -అసలేమైందంటే

18 నెలల కష్టం..

18 నెలల కష్టం..

అనుకున్న‌దే త‌డ‌వుగా గ్రామంలోని 250 మంది మ‌హిళ‌లు బృందాలుగా ఏర్ప‌డి 18 నెల‌ల పాటు శ్ర‌మించి.. అర కిలోమీటరు పొడవున కొండను తొలిచేసి.. అడవిలోపారే నీళ్లు ఊరి చెరువులోకి వచ్చేలా చేశారు ఆ మహిళలు. అక్కడున్నవాళ్లలో మెజార్టీ కుటుంబాలు ఆదివాసి గిరిజనులే. గ్రామంలో నీటి కొర‌త ఉందని, వ్యవసాయం చేయలేకపోతున్నామని, పశువుల దాహాం తీర్చడానికి ఇబ్బందిపడేవాళ్లమని, అందుకే కలిసికట్టుగా కొండను తొవ్వాలని నిర్ణయిచుకున్నామని వారు చెబుతున్నారు.

సర్కారు చూడనేలేదు..

సర్కారు చూడనేలేదు..

‘‘గడిచిన 18 నెలులగా మహిళలు అందరం కలిసి కొండను తొవ్వుతున్న సంగతి పంచాయితీ అధికారులకు తెలుసు. కానీ ఏనాడూ వాళ్లు ఇటు పక్కకు వచ్చిన పాపానపోలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకనే మేం వట్టి చేతులతో కొండను తొవ్వే పనికి పూనుకున్నాం. ఎలాగైతేనేం.. చివరికి విజయం సాధించాం..''అని గర్వంగా చెప్పారు అంగ్రోతా మహిళలు. ఇకనైనా ప్రభుత్వం తమవైపు చూసి, శాశ్వత పథకం ఏదైనా మంజూరు చేయాలని వారు కోరారు. తొవ్వకం పనుల్లో చిన్నాపెద్దా తేడాలేకుండా మహిళలందరూ పాలుపంచుకోవడం గమనార్హం. న్యూస్ ఏజెన్సీ ‘ఏఎన్ఐ' ద్వారా వెలుగులోకి వచ్చిందీ వార్త.

English summary
A group of roughly 250 women from the village of Angrotha in Madhya Pradesh took great pains to cut a hill in the last 18 months. The aim was to create a way for water to reach a pond inside the village, as per a report in ANI. The village has been facing a water shortage for some time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X