• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సతీ సావిత్రి, భర్తను చంపేసి వంటిట్లో పూడ్చేసి పొయ్యి పెట్టి వెరైటీ వంటలు, అక్రమ సంబంధం!

|

అనుపూర్/మధ్యప్రదేశ్: అక్రమ సంబంధం కారణంగా భర్తను చంపేసి ఇంట్లోని వంట గదిలో పూడ్చేసి పైన పోయ్యి పెట్టి నెల రోజులు వరైటీ వంటలు చేసింది ఓ భార్య. తన భర్త కనపడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మీవల్లనే నా భర్త ఎక్కడికో వెళ్లిపోయాడని, దీనికంతటికి మీరే కారణం అంటూ భర్త కుటుంబ సభ్యులకు శాపనార్తాలు పెట్టింది. అయితే చివరికి అసలు విషయం వెలుగు చూడటంతో బెండ్ తీసిన భర్త కుటుంబ సభ్యులు ఆమెను పోలీసులకు అప్పగించారు. నిజం నిప్పులాంటిది ఎప్పుడైనా అది బయటకు వస్తోంది అంటున్నారు పోలీసులు.

డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు, లేడీ ప్రొఫెసర్ బెయిల్ రద్దు, అరెస్టు వారెంట్, ఆడియో!

లాయర్ కు తప్పని తిప్పలు

లాయర్ కు తప్పని తిప్పలు

మధ్యప్రదేశ్ లోని అనుపూర్ జిల్లాలోని కరోండి ప్రాంతంలో మహేష బనావాల్ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మహేష్ బానావాల్ భార్య ప్రమీల (32). మహేష్ బనావాల్, ప్రమీల దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. మహేష్ లాయర్. ప్రతి రోజు కోర్టులో అనేక కేసులో వాదించే మహేష్ ఇంటిలో మాత్రం భార్య ప్రమీలతో అనేక తిప్పలు పడ్డాడు.

అక్రమ సంబంధం

అక్రమ సంబంధం

కుటుంబ కలహాలతో మహేష్, ప్రమీల నిత్యం గొడవలు పడేవారు. చిన్నచిన్న విషయాలకు ప్రమీల భర్త మహేష్ తో గొడవపడేది. తన భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని ప్రమీలకు అనుమానం ఉంది. మహేష్ సోదరుడు గంగారం భన్వాల్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది.

చంపేసి సైలెంట్ గా వంటిట్లో పూడ్చేసింది

చంపేసి సైలెంట్ గా వంటిట్లో పూడ్చేసింది

అక్టోబర్ 22వ తేదీన భర్త మహేష్ తో గొడవ పడిన ప్రమీల తరువాత అతన్ని హత్య చేసింది. తరువాత ఇంట్లోని వంట గదిలో మహేష్ మృతదేహాన్ని పూడ్చిపెట్టేసింది. భర్త మహేష్ మృతదేహం ఉన్న ప్రాంతాన్ని కాంక్రీట్ తో మూయించిన ప్రమీల దాని మీద పోయ్యి పెట్టి వరైటీ వంటలు చెయ్యడం మొదలు పెట్టంది.

నాటకాలు ఆడిన సతీ సావిత్రి

నాటకాలు ఆడిన సతీ సావిత్రి

తన భర్త మహేష్ కనపడటం లేదని ప్రమీల పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు ఏమీ తెలియనట్లు బంధువుల దగ్గర ప్రమీల నాటకాలు ఆడింది. మహేష్ కోసం అతని బంధువులు ఇంటికి వస్తే నా భర్త కనపడకుండా పోయి ఇన్ని రోజులు అయినా మీరు ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, అతని కోసం వెతకడం లేదని, మీ వల్లే నా భర్త కనిపించకుండా పోయాడని, మీరెవ్వరూ నా ఇంటికి రాకూడదని ప్రమీల ముసలి కన్నీరు కారుస్తూ వారికి శాపనార్తాలు పెట్టింది.

బంధువులకు అనుమానం

బంధువులకు అనుమానం

మహేష్ కుటుంబ సభ్యులు ఇంటి దగ్గరకు వస్తే వారి మీద తిట్లపురాణం మొదలు పెడుతున్న ప్రమీల వారిని ఎవ్వరినీ ఇంట్లోకి రాకుండా జాగ్రత పడేది. ఇంటి దగ్గరకు వచ్చిన మహేష్ కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి దుర్వాసన వస్తున్న విషయం గుర్తించి ప్రమీలను నిలదీశారు. అనుమానం ఎక్కువ కావడంతో స్థానికుల సహాయంతో మహేష్ కుటుంబ సభ్వులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవంబర్ 21వ తేదీ గురువారం సాయంత్రం పోలీసులు వెళ్లి ప్రమీల ఇంటిలో తనిఖీలు చేశారు.

తమ్ముడి భార్యతో రాసలీలలు

తమ్ముడి భార్యతో రాసలీలలు

మహేష్ ను హత్య చేసి వంట గదిలో పూడ్చిపెట్టిన విషయం గుర్తించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టుంకు తరలించారు. మహేష్ అతని సోదరుడు గంగారాం భన్వాల్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. గంగారాం సహాయంతో ప్రమీల మహేష్ ను హత్య చేసిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే మహేష్ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని గంగారం అంటున్నాడని పోలీసులు అన్నారు. మహేష్ ను హత్య చెయ్యడానికి ప్రమీలాకు ఎవరైనా సహకరించారా ? అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మొత్తం మీద భర్త మహేష్ ను హత్య చేసి వంటిట్లో పూడ్చి పెట్టి నెల రోజుల పాటు వంట చేసి ఏమీ తెలీనట్లు నాటకాలు ఆడిన ప్రమీలను పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు.

English summary
A Madhya Pradesh woman has been arrested for murdering her husband. After killing the 35-year-old, the accused buried the body in her kitchen where she continued her routine, police have said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X