వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ వర్షాలు: చిన్న హాని జరగలేదు: భూమిలో కలిసిపోయిన భవనం, కళ్ల ముందే, వైరల్ !

|
Google Oneindia TeluguNews

Recommended Video

కొడుగు జిల్లాలో భూమిలోకి జారి పోయిన భవనం

బెంగళూరు: కర్ణాటకలోని కొడుగు, దక్షిణ కన్నడ జిల్లాలో కురుసిన భారీ వర్షాల కారణంగా రూ. కోట్ల విలువైన ఆస్తినష్టం జరిగింది. అనేక ఇండ్లు నేల మట్టం అయ్యాయి. పంటలు జలమయం అయ్యాయి. అయితే ఓ చిరు వ్యాపారి ఇళ్లు మాత్రం ఎలాంటి హానీ జరగకున్నా రెండు అంతస్తులు నేరుగా జారుకుంటూ భూమిలో కలిసిపోయింది.

చిరు వ్యాపారి

చిరు వ్యాపారి

మడికేరిలో ప్రసిద్ది చెందిన ముత్తప్ప దేవాలయం సమీపంలో ఆనీఫ్ (54) కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. ఆనీఫ్, ఆయన కుమారుడు మడికేరీలో పండ్లు, కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబ సభ్యులను పోషిస్తున్నారు.

అప్పు చేసి ఇళ్లు కట్టాడు

అప్పు చేసి ఇళ్లు కట్టాడు

వ్యాపారంలో సంపాధించిన రూ. 3 లక్షలు పొగుచేసుకున్న ఆనీఫ్ రూ. 16 లక్షలు రుణం తీసుకుని 8 సంవత్సరాల క్రితం ముత్తప్ప దేవాలయం సమీపంలోని గుట్ట మీద రెండు అంతస్తుల ఇళ్లు కట్టుకున్నాడు. మూడు సంవత్సరాలు కింది అంతస్తు వేరే కుటుంబ సభ్యులకు ఆయకం పెట్టాడు. పై అంతస్తులో ఆనీఫ్ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు.

భూమి కుంగిపోయింది

భూమి కుంగిపోయింది

ఎప్పటిలాగే కుమారుడితో కలిసి ఆనీఫ్ వ్యాపారం చెయ్యడానికి ఉదయం 7.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లాడు. ఇంటిలో ఆనీఫ్ భార్య అమీనా మాత్రం ఉన్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆనీఫ్ నివాసం ఉంటున్న ఇంటి గుట్ట కింద భూమి కుంగిపోతూ వచ్చింది. ఇంటి కింద ఉన్న భూమి కొంచెం కొంచెం గుట్ట కిందకు జారిపోయింది.

9 గంటలకు ఫోన్

9 గంటలకు ఫోన్

ఉదయం 9 గంటల సమయంలో అమీనా భర్త ఆనీఫ్ కు ఫోన్ చేసి ఇంటి వెనుక భూమి కొంచెం కొంచెం కిందకు జారిపోతుందని, ఇల్లు కదులుతోందని చెప్పింది. అమీన్, అతని కుమారుడు ఇంటి దగ్గరకు పరుగు తీశారు. ఇంటిలో ఉన్న భార్య అమీనాను ఆనీఫ్ అతి కష్టం మీద బయటకు తీసుకు వచ్చాడు.

ఒక్కసారిగా జారిపోయింది

ఒక్కసారిగా జారిపోయింది

ఇంటిలోని విలువైన వస్తువులు తీసుకురావడానికి ఆనీఫ్, అతని కుమారుడు ప్రయత్నించారు. అయితే అందుకు అవకాశం లేకుండా పోయింది. రెండు అంతస్తుల భవనం ఒక్కసారిగా వెనక ఉన్న గుట్ట కిందకు జారిపోయి భూమిలో కలిసిపోయింది. భవనంకు ఎలాంటి హానీ జరగకపోయినా భూమిలోకి జారి పోయింది. ఒక్కసారిగా ఇల్లు జారి పోవడంతో ఆనీఫ్ భార్య అమీనా సృహ తప్పిపోవడంతో ఆసుపత్రికి తరలించారు.

ప్రాణాలు మిగిలాయి చాలు

ప్రాణాలు మిగిలాయి చాలు

ఆనీఫ్ కుమార్తె, అల్లుడు మంగళూరు వెళ్లారు. భారీ వర్షాలు, వరదల కారణంగా మంగళూరు-మడికేరి రహదారి పూర్తిగా మూసి వేయడంతో వారు మంగళూరులోనే ఉండిపోయారు. భార్య, కుమారుడు, కుమార్తె, అల్లుడు, వారి బిడ్డ ప్రాణాలతో బయటపడ్డారని, అది చాలు అని ఆనీఫ్ అంటున్నారు. ఆనీ ఫ్ కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడ్డారు.

వైరల్ వీడియో

గుట్టమీద నుంచి జారుకుంటూ ఆనీఫ్ భవనం భూమిలో కలిసిపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సంతోషంగా బక్రీద్ పండగ చేసుకోవలసిన ఆనీఫ్ కుటుంబ సభ్యులు నేడు నిరాశ్రులయ్యారు. ప్రతి ఒక్కరూ ఆనీఫ్ కుటుంబ సభ్యులను చూసి జాలిపడుతున్నారు.

English summary
54 year old Aneef house collapsed in Madikeri on August 15, 2018. 8 year old house near Muthappa temple crashed. Now nothing left for my family but all the members are safe said Aneef. House collapse video goes viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X