వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వ అంగన్ వాడీ కేంద్రంలో జిల్లా ఎస్పీ కుమార్తె, పరువు ప్రతిష్ట అనే రోజుల్లో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: తమ పిల్లల విద్యాభ్యాసం విషయం కూడా పరువు ప్రతిష్టగా భావించే తల్లిదండ్రులను ఈ రోజుల్లో మనం చాల మందిని చూస్తున్నాం. పిల్లలు పుట్టిన తరువాత చిన్నారులకు ఇంగ్లీష్ బాషలో మాట్లాడించాలని చాల మంది ప్రయత్నాలు చేస్తుంటారు.

చిన్నారులను బేబీ సిట్టింగ్, ఎల్ కేజీ, యూకేజీలో చేర్చించడానికి వారి కుటుంబ సభ్యులు పోటీ పడుతూ లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే ఎలాంటి పోటీ లేకుండా చిన్నారులను ప్రభుత్వ అంగన్ వాడీ కేంద్రాల్లో చేరుస్తున్నారు.

 Madikeri SP Dr Suman D Pannekar enroll his daughter to anganawadi

ప్రభుత్వం ఉద్యోగం చేసే చాల మంది వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఈ రోజుల్లో కలలో కూడా ఊహించడం లేదు. వారివారి స్థోమతకు తగ్గట్లు తమ పిల్లలను అంగ్లీష్ మీడియం స్కూల్స్ లో సీట్లు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు.

కర్ణాటకలోని కొడుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సుమన్ డి. పన్నేకర్ తన కుమార్తెను ప్రభుత్వ అంగన్ వాడీ కేంద్రంలో చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. కొడుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సుమన్ డి. పన్నేకర్ కు 2 సంవత్సరాల 6 నెలల ఖుషీ అనే కుమార్తె ఉంది.

కొడుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సుమన్ డి. పన్నేకర్ ఆయన కుమార్తె ఖుషీని మడికేరిలోని ఫీల్డ్ మార్షల్ కార్యప్ప కాలేజ్ సమీపంలోని అంగన్ వాడీ కేంద్రంలో చేర్పించారు. తన కుమార్తె ఖుషీ విద్యాభ్యాసం అంగన్ వాడీ కేంద్రం నుంచి ప్రారంభం కావాలని ఎస్పీ డాక్టర్ సుమన్ డి. పన్నేకర్ నిర్ణయించారు.

అంగన్ వాడీ కేంద్రాలు ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు ధీటుగా ఉన్నాయని, అక్కడ విద్యాభ్యాసం చాలా బాగుంటుందని తన కుమార్తె ఖుషీని చేర్పించానని డాక్టర్ సుమన్ డి. పన్నేకర్ అంటున్నారు. ఒక జిల్లాకు ఎస్పీ అయిన డాక్టర్ సుమన్ డి. పన్నేకర్ ఆయన కుమార్తెను అంగన్ వాడీ కేంద్రంలో చేర్పించి నేటి తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలిచారు.

English summary
Kodagu District Superintendent of Police, Dr.Suman D. Panneker, has become role model for others by enrolling his daughter in Government Anganwadi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X