వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడు రసవత్తర రాజకీయాలు: అన్నాడీఎంకేలో ఇరు వర్గాలకు ఊరట, ఉప ఎన్నికలు!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఇప్పుడే ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనపడటంలేదు. అన్నాడీఎంకే పార్టీ గ్రూప్ రాజకీయాల్లో సందిగ్దం కొనసాగుతోంది. 18 మంది అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విషయంలో మద్రాస్ హైకోర్టు ఎటూ తేల్చకపోవడంతో మళ్లీ ఇరు వర్గాల్లో టెన్షన్ మొదలైయ్యింది.

అనుభవంతోనే అనర్హులను చేశాను: జయలలితో సహ నాపైన వేటు, తమిళనాడు స్పీకర్ ధనపాల్!అనుభవంతోనే అనర్హులను చేశాను: జయలలితో సహ నాపైన వేటు, తమిళనాడు స్పీకర్ ధనపాల్!

అన్నాడీఎంకేలోని రెండు వర్గాలకు ఊరటనిచ్చేలా బుధవారం మద్రాసు హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఇరు వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరుకు తమిళనాడు శాసన సభలో బలపరీక్ష నిర్వహించరాదని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మా ఆదేశాలు పాటించండి

మా ఆదేశాలు పాటించండి

గతంలో మేము ఇచ్చిన అదేశాలను కొనసాగించాలని మద్రాసు హైకోర్టు సూచించింది. అనర్హతకు గురైన 18 మంది శాసన సభ్యులకు చెందిన నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించరాదని తమిళనాడు ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఉప ఎన్నికలు వద్దు

ఉప ఎన్నికలు వద్దు

టీటీవీ దినకరన్ వర్గంలోని 18 మంది అనర్హత ఎమ్మెల్యేల విచారణ అక్టోబర్ 4వ తేదీకి మద్రాసు హైకోర్టు వాయిదా వేసింది. అక్టోబర్ 4వ తేదీ వరకు 18 నియోజక వర్గాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించకూడదని తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది.

దినకరన్ గ్రూప్ హ్యాపీ

దినకరన్ గ్రూప్ హ్యాపీ

మద్రాసు హైకోర్టు తీర్పును టీటీవీ దినకరన్ వర్గీయులు స్వాగతించారు. తమకు కచ్చితంగా న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు అంటున్నారు. స్పీకర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని దినకరన్ వర్గీయులు ఆరోపించారు.

స్పీకర్ తప్పు చెయ్యలేదు

స్పీకర్ తప్పు చెయ్యలేదు

తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ చట్టప్రకారం వ్యవహరించారని ఆయన తరపున న్యాయవాది అరిమ సుందరం అన్నారు. అసెంబ్లీలో ఎడప్పాడి పళనిసామి బలపరీక్ష నిర్వహించకుండా గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ కావాలనే కాలం గడుపుతున్నారని డీఎంకే తరపున సీనియర్ న్యాయవాది కలిల్ సిబాల్ కోర్టులో వాదించారు.

వేచి చూస్తాం, డీఎంకే

వేచి చూస్తాం, డీఎంకే

మద్రాసు హైకోర్టు తదుపరి తీర్పు కోసం డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎంకే స్టాలిన్ సైతం ఎదురు చూస్తున్నారు. హైకోర్టు తీర్పు అనంతరం మా నిర్ణయం ప్రకటిస్తామని డీఎంకే పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.

English summary
Madras High court denied to give stay on 18 MLAs disqualification issue.Madras Highcourt's order is a setback for CM Palanisamy for the action taken to do floor test immediately and the court's order gives interim win to DMK and TTV. Dinakaran group.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X