వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడులో లిక్కర్ షాపులు మూసేయండి, ఆన్‌లైన్ డెలివరీ అయితే ఓకే: మద్రాస్ హైకోర్టు

|
Google Oneindia TeluguNews

మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. మద్యం విక్రయాలను నిలపివేయాలని ఆదేశాలు జారీచేసింది. లాక్‌డౌన్ ముగిసేవరకు మద్యం షాపులు తెరవొద్దని స్పష్టంచేసింది. మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించకపోవడంతో దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు విచారించింది. ఆన్ లైన్ ద్వారా మాత్రం మద్యం విక్రయించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 17వ తేదీ వరకు మాత్రమే విక్రయాలు జరపాలని సూచించింది.

కరోనా లాక్ డౌన్: 100 మంది సీపీఎం మహిళలపై ఖాకీల లాఠీచార్జీ, ఎక్కడో, ఎందుకో తెలుసా...?కరోనా లాక్ డౌన్: 100 మంది సీపీఎం మహిళలపై ఖాకీల లాఠీచార్జీ, ఎక్కడో, ఎందుకో తెలుసా...?

తమిళనాడు రాష్ట్రంలో గురువారం మద్యం దుకాణాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఒక్క రోజే రూ.172 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మధురైలో రికార్డుస్థాయిలో రూ. 46.78 కోట్ల మద్యం సేల్ అయ్యింది. మిగతా చోట్ల కూడా భారీగా లిక్కర్ అమ్ముడుపోయింది.

Madras HC orders closure of all state-run liquor shops in Tamil Nadu

దీంతో మద్యం ద్వారా రూ.100 కోట్ల పైచిలుకు రాబడి వచ్చింది. వైన్ షాపుల వద్ద భౌతికదూరం పాటించకపోవడం ఆందోళన కలిగించింది. కరోనా వైరస్ కేసులు పెరుగుతాయని కొందరు పిటిషన్లు దాఖలు కాగా.. ధర్మాసనం విచారించింది. లిక్కర్ షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది.

English summary
Madras High Court has ordered closure of all state-run liquor shops in Tamil Nadu and has permitted only online sale of liquor. The online sale of liquor will be allowed only till May 17.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X